Pakistan Super League: పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. పాకిస్థాన్ ఆటగాళ్లతో పాటు క్రికెట్ బోర్డుపై కొన్నాళ్లుగా క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతోన్నారు. తాజాగా మరోసారి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరువు పోయింది. ఐపీఎల్‌కు పోటీగా పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను (పీఎస్ఎల్)పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మొదలుపెట్టింది. ఆరంభంలో మోస్తారు ఆదరణను దక్కించుకున్న ఈ లీగ్ ఆ తర్వాత అట్టర్ ఫ్లాప్‌గా మారిపోయింది. చాలా మంది ఫారిన్ స్టార్ ప్లేయర్లు ఈ లీగ్‌కు దూరంగా ఉంటున్నారు.
ఈ ఏడాది పీఎస్ఎల్ లీగ్ ఇటీవలే మొదలైంది. పీఎస్ఎల్ లీగ్‌లో భాగంగా ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ కరాచీ కింగ్స్ మధ్య ఇటీవల మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ ఇరవై ఓవర్లలో 234 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 63 బాల్స్‌లో 105 పరుగులు చేశాడు. ఈ లక్ష్యాన్ని మరో నాలుగు బాల్స్ ఉండగానే కరాచీ కింగ్స్ ఛేదించింది.
జేమ్స్ వీస్ సెంచరీతో అదరగొట్టి కరాచీ కింగ్స్‌కు విజయాన్ని అందించాడు. 43 బాల్స్‌లోనే 14 ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. సెంచరీతో అదరగొట్టిన జేమ్స్ వీస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు రియలబుల్ ప్లేయర్ గా కూడా అవార్డు దక్కింది. రియలబుల్ ప్లేయర్‌కు గాను కరాచీ కింగ్స్ యాజమాన్యం అతడికి హెయిర్ డ్రయర్‌ను గిఫ్ట్‌గా అందించింది.
జేమ్స్ వీస్‌కు కరాచీ కింగ్స్ కోచ్ హెయిర్ డ్రయర్‌ను గిఫ్ట్‌గా అందజేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హెయిర్ డ్రయర్‌ను గిఫ్ట్‌ను అందుకున్న వీస్‌ను టీమ్‌లోని ఇతర ఆటగాళ్లు చప్పట్లు కొట్టి అభినందిస్తున్నట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పీఎస్ఎల్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. షేవింగ్ కిట్స్ , వాటర్ బాటిల్లు కూడా గిఫ్ట్‌గా ఇవ్వండి అంటూ కామెంట్స్ చేస్తోన్నారు. ఐపీఎల్‌కు పీఎస్ఎల్ ఏ మాత్రం పోటీ కాదని, గల్లీ క్రికెట్ కూడా ఇంత కంటే ఖరీదైన బహుమతులు ఇస్తారని ట్రోల్ చేస్తోన్నారు.
సంబంధిత కథనం