MS Dhoni : ‘ఏంటీ.. ధోనీకి 42ఏళ్లా? అస్సలు నమ్మలేము’-is he 42 srikkanth lauds vintage dhoni makes ipl retirement prediction ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  'Is He 42?': Srikkanth Lauds Vintage Dhoni, Makes Ipl Retirement Prediction

MS Dhoni : ‘ఏంటీ.. ధోనీకి 42ఏళ్లా? అస్సలు నమ్మలేము’

Sharath Chitturi HT Telugu
Apr 01, 2024 02:43 PM IST

CSK vs DC : వింటేజ్​ ధోనీ బ్యాటింగ్​ చూసి.. ఫ్యాన్స్​ థ్రిల్​ అయ్యారు. టీమిండియా మాజీ క్రికెటర్​ కృష్ణమచారి శ్రీకాంత్​ అయితే.. “ధోనీకి 42ఏళ్లా? నమ్మలేము,” అంటున్నారు.

Chennai Super Kings' MS Dhoni plays a shot.
Chennai Super Kings' MS Dhoni plays a shot. (ANI)

MS Dhoni batting today : ఐపీఎల్​లో ఇతర టీమ్స్​ ఫ్యాన్స్​ పరిస్థితి ఒకటి.. చెన్నై సూపర్​ కింగ్స్​ అభిమానుల పరిస్థితి ఒకటి! ఎవరైన వికెట్​ పడకూడదు, వికెట్​ పడకూడదు అనుకుంటారు. కానీ సీఎస్​కే ఫ్యాన్స్​ మాత్రం.. వికెట్​ పడాలి, వికెట్​ పడాలి అని ప్రార్థిస్తుంటారు. ఎందుకంటే.. వికెట్​ పడితేనే కదా మహేంద్ర సింగ్​ ధోనీ క్రీజ్​లోకి వస్తాడు- ధనాధన్​ షాట్స్​తో అలరిస్తాడు! ఆదివారం డీసీతో జరిగిన మ్యాచ్​లో.. సీఎస్​కే ఫ్యాన్స్​ ఆశలు నెరవేరాయి! ఐపీఎల్​2024లో తొలిసారిగా బ్యాటింగ్​కి దిగిన ధోనీ.. చలరేగి ఆడాడు. మ్యాచ్​ ఓడిపోయినప్పటికీ.. ధోనీ కొట్టిన షాట్స్​కి ఫ్యాన్స్​ ఫిదా అయిపోయారు. వీరిలో.. టీమిండియా మాజీ క్రికెటర్​ క్రిష్ణమచారి శ్రీకాంత్​ కూడా ఒకరు. అసలు ధోనీకి 42ఏళ్లంటే.. నమ్మలేమని శ్రీకాంత్​ అభిప్రాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

ధనాధన్​ ధోనీ..

ఆదివారం వైజాగ్​లో డీసీతో జరిగిన మ్యాచ్​లో 16 బాల్స్​లో 37 పరుగులు చేశాడు ధోనీ. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్స్​లు ఉన్నాయి. ఫలితంగా.. స్టేడియంలో ఫ్యాన్స్​ జోష్​కి హద్దే లేకపోయింది.

ఈ నేపథ్యంలో ధోనీ బ్యాటింగ్​పై కామెంట్స్​ చేశారు శ్రీకాంత్​.

CSK vs DC highlights : "ఒక ఎంఎస్​ ధోనీ అభిమానిగా నాకు చాలా సంతోషంగా ఉంది. వాటే నాక్​! 42ఏళ్ల వయస్సులో ఓ వ్యక్తి ఈ రేంజ్​లో హిట్టింగ్​ చేస్తున్నాడంటే నమ్మడం కష్టమే. వింటేజ్​ ధోనీ! 2005లో ఇదే వైజాగ్​లో పాకిస్థాన్​పై అగ్రెసివ్​ సెంచరీ కొట్టాడు. పాకిస్థాన్​ బౌలింగ్​ని చీల్చిచండాడేశాడు," అని నాటి రోజులను గుర్తుచేశారు శ్రీకాంత్​.

"పాయింట్​వైపు సిక్స్​లు కొడుతున్నాడు. మిడ్​ వికెట్​ స్టాండ్స్​లోకి ఒక చేత్తో 6లు బాదుతున్నాడు. స్టేడియం మొత్తం హిట్టింగ్​ చేస్తున్నాడు. దిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వాటే నాక్​! ఆ కవర్​ డ్రైవ్​, ఆ లీనింగ్​ 6.. బ్రిలియంట్​," అన్నారు శ్రీకాంత్​.

ఇక ప్రస్తుతం ఉన్న వికెట్​కీపర్స్​లో ధోనీయే ది బెస్ట్​ అని అభిప్రాయపడ్డారు శ్రీకాంత్​.

MS Dhoni batting : "కీపింగ్​ విషయానికొస్తే.. ధోనీ ఇప్పటికీ బెస్ట్​ ఇండియన్​ వికెట్​కీ పర్​. చాలా అలవోకగా క్యాచ్​లు పడుతున్నాడు. నెంబర్​1 ధోనీ. ఆ తర్వాత నెంబర్​ 2 వృద్ధిమాన్​ సాహా. ధోనీ బాగా కీపింగ్​ చేస్తున్నాడు. బాగా బ్యాటింగ్​ చేస్తున్నాడు. వికెట్ల ముందు బాగా రన్నింగ్​ చేస్తున్నాడు. ధోనీకి 42ఏళ్లా? నమ్మలేము. నాకు తెలిసి.. ధోనీ ఇంకో రెండేళ్లు ఐపీఎల్​ ఆడతాడు," అని అన్నారు శ్రీకాంత్​.

సీఎస్​కే వర్సెస్​ డీసీ..

ఇక ఆదివారం జరిగిన మ్యాచ్​ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్​ చేసిన డీసీ.. 20ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఛేజింగ్​లో తడబడిన సీఎస్​కే.. 20ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 171 రన్స్​ చేసింది.

తాజా ఓటమితో.. సీఎస్​కే జట్టు ఐపీఎల్​2024 పాయింట్స్​ టేబుల్​లో రెండో స్థానానికి పడిపోయింది. డీసీ.. 7వ స్థానంలో ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం