IND vs IRE: ఐర్లాండ్‍తో మ్యాచ్‍లో భారత తుది జట్టు ఎలా ఉండాలో చెప్పిన ఇర్ఫాన్ పఠాన్.. పంత్ ఆ స్థానంలో రావాలని సలహా
IND vs IRE T20 World Cup 2024: టీ20 ప్రపంచకప 2024 టోర్నీలో ఐర్లాండ్‍తో తన తొలి మ్యాచ్ ఆడనుంది భారత్. ఈ మ్యాచ్‍లో టీమిండియా తుది జట్టులో ఎవరు ఉండాలో మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించారు.
IND vs IRE T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2024లో తన పోరును మొదలుపెట్టేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ మెగాటోర్నీతో తన తొలి మ్యాచ్‍ను ఐర్లాండ్‍తో భారత్ ఆడనుంది. న్యూయార్క్‌లోని నసావూ స్టేడియం వేదికగా భారత్, ఐర్లాండ్ మధ్య గ్రూప్-ఏ మ్యాచ్ బుధవారం (జూన్ 5) జరగనుంది. వరల్డ్ కప్ వేటను ఈ మ్యాచ్‍తోనే రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ షురూ చేయనుంది. ఈ మ్యాచ్‍లో టీమిండియా తుది జట్టు ఎలా ఉండాలో మాజీ స్టార్ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు.
ఓపెనర్లుగా రోహిత్ - కోహ్లీ రావాలి
టీమిండియాకు ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రావాలని స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‍ను తన తుదిజట్టులో చేర్చలేదు.
పంత్ మూడో ప్లేస్‍లో రావాలి
వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో రావాలని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. బంగ్లాదేశ్‍తో వామప్ మ్యాచ్‍లో మూడో ప్లేస్‍లో వచ్చిన పంత్ అర్ధ శకతంతో దుమ్మురేపాడు. అయితే, అసలు మ్యాచ్‍ల్లోనూ పంత్‍ను ఒక వికెట్ పడిన వెంటనే మూడో స్థానంలో బ్యాటింగ్‍కు పంపాలని పఠాన్ సూచించాడు.
టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో మూడో ప్లేస్‍లో పంత్ బ్యాటింగ్‍కు వస్తే ఎలా ప్లస్ అవుతుందో పఠాన్ వివరించాడు. “పంత్‍ను మూడో ప్లేస్‍లో బ్యాటింగ్‍కు దింపాలనే ఐడియా నాకు నచ్చింది. ఒకవేళ పంత్ పవర్‌ప్లేలో బ్యాటింగ్ చేస్తే.. ఆఫ్‍సైడ్‍లో అతడిని ట్రాప్ చేయాలనే ప్రత్యర్థి వ్యూహాలు ఫలించవు. ఎందుకంటే అప్పుడు ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే 30 యార్డ్స్ సర్కిల్ బయట ఉంటారు. పంత్ మరింత స్వేచ్ఛగా ఆడడం మనం చూడొచ్చు” అని పఠాన్ చెప్పాడు. మొత్తంగా.. మూడో ప్లేస్‍లో బ్యాటింగ్‍కు వస్తే ఆఫ్ సైడ్ బంతులు వేసి అతడిని ఇబ్బంది పెట్టాలనుకునే ప్రత్యర్థి జట్టు ప్లాన్ పారదని పఠాన్ అన్నారు.
భారత తుది జట్టులో స్పినర్లుగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఉండాలని, పేసర్లుగా జస్‍ప్రీత్ బుమ్రాా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్‍కు చోటివ్వాలని అన్నాడు. ఆల్‍రౌండర్ శివమ్ దూబేను తుదిజట్టులో ఉండాలని ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు.
ఐర్లాండ్‍తో మ్యాచ్‍కు ఇర్ఫాన్ పఠాన్ సూచించిన భారత తుదిజట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్‍ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్
అమెరికా వేదికగా జరిగే మ్యాచ్‍ల్లో ముగ్గురు పేసర్లు ఉంటేనే మేలని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. వెస్టిండీస్‍లో మ్యాచ్‍లు ఆడితే ఇద్దరు పేసర్లనే తీసుకొని.. స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‍ను తుదిజట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్‍మెంట్‍కు అభిప్రాయపడ్డాడు.
కాగా, ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వస్తారా.. యశస్వి జైస్వాల్.. భారత తుది జట్టులో ఉంటాడా అనేది ఉత్కంఠగా ఉంది. ఒకవేళ జైస్వాల్ ఆడితే విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‍కు దిగాల్సి ఉంటుంది. అయితే, ఓపెనర్‌గా ఐపీఎల్ 2024 సీజన్‍లో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో కోహ్లీనే ఓపెనర్‌గా రావాలని చాలా మంది మాజీలు కూడా సూచిస్తున్నారు.