IPL 2025 Virat Kohli: విరాట్ కోహ్లి స్పెషల్ డైమండ్ రింగ్ చూశారా.. ఆ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా.. వీడియో ఇదే-ipl 2025 virat kohli special t20 world cup diamond ring his john cena moment and dance steps goes viral ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2025 Virat Kohli: విరాట్ కోహ్లి స్పెషల్ డైమండ్ రింగ్ చూశారా.. ఆ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా.. వీడియో ఇదే

IPL 2025 Virat Kohli: విరాట్ కోహ్లి స్పెషల్ డైమండ్ రింగ్ చూశారా.. ఆ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా.. వీడియో ఇదే

IPL 2025 Virat Kohli: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గ్రౌండ్ లోనే కాదు బయట కూడా యమ యాక్టివ్ గా ఉంటారు. డ్రెస్సింగ్ రూమ్ లో డ్యాన్స్ చేస్తూ, సహచర ఆటగాళ్లతో జోక్స్ వేసుకుంటూ ఉంటాడు. తాజాగా ఆర్సీబీ రిలీజ్ చేసిన వీడియోలో కోహ్లి స్పెషల్ డైమండ్ రింగ్, అతని డ్యాన్స్ స్టెప్స్ వైరల్ గా మారాయి.

విరాట్ కోహ్లి స్పెషల్ రింగ్

ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ధరించిన డైమండ్ రింగ్ వైరల్ గా మారింది. ఆ డైమండ్ రింగ్ ధరించిన అతను.. డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ జాన్ సీనా స్టైల్లో చేసిన గెస్చర్ కూడా అదిరిపోయింది. ఆర్సీటీ టీమ్ సభ్యులతో కలిసి కోహ్లి చేసిన డ్యాన్స్ మూవ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

యూ కెనాట్ సీ మీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి ఇంటర్నెట్ ను మరోసారి ఊపేస్తున్నాడు. ఐపీఎల్ 2025లో నేడు (ఏప్రిల్ 7) వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ ను ఆర్సీబీ ఢీ కొడుతోంది. ఈ మ్యాచ్ కు ముందు కోహ్లి స్పెషల్ రింగ్ ధరించడం వైరల్ గా మారింది. అంతే కాకుండా ఆ రింగ్ ధరించి.. లెజెండ్ జాన్ సీనా ఐకానిక్ గెస్చర్ 'మీరు నన్ను చూడలేరు (యూ కెనాట్ సీ మీ)' అనేలా చేయి ఊపుతూ విరాట్ అదరగొట్టాడు.

డ్యాన్స్ అదుర్స్

ఆర్సీబీ సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసిన వీడియోలో కోహ్లీ డైమండ్ తో కూడిన టీ20 వరల్డ్ కప్ రింగ్‌ను ధరించి, సీనా థీమ్ సాంగ్ 'ది టైమ్ ఇస్ నౌ'కు డ్యాన్స్ చేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో టిమ్ డేవిడ్ తో కలసి కోహ్లి స్టెప్పులు వేశాడు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘‘అతని టైమ్ ఇప్పుడు, ఎప్పటికీ. విరాట్ కోహ్లి అంటేనే వైబ్’’ అని ఆర్సీబీ క్యాప్షన్ ఇచ్చింది.

ఆ రింగ్ ఏంటీ?

ఆర్సీబీ పోస్టు చేసిన వీడియోలో కోహ్లి ధరించిన డైమండ్ రింగ్ హాట్ టాపిక్ గా మారింది. అయితే 2024 టీ20 ప్రపంచకప్ విన్నర్ గా నిలిచిన ఇండియన్ టీమ్ క్రికెటర్లకు బీసీసీఐ ఈ స్పెషల్ డైమండ్ రింగ్ లు అందించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నమన్ అవార్డుల ఫంక్షన్ లో బీసీసీఐ.. ఆ వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లోని ప్రతి ఆటగాడికి డైమండ్ రింగ్‌ ఇచ్చింది.

ఈ రింగ్స్ ను "ఛాంపియన్స్ రింగ్" గా ప్రకటించారు. ఈ రింగ్‌లో ప్రతి ఆటగాడి పేరు, జెర్సీ నంబర్, మధ్యలో ఆశోక చక్రం ఉన్నాయి. ఆ చక్రం చుట్టూ "ఇండియా టీ20 వరల్డ్ ఛాంపియన్స్ 2024" అని రాసి ఉంది.

2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఇండియా ఓడించింది. ఆ ఫైనల్లో కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేశారు. తన ఇన్నింగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం