IPL 2025 DC Vs SRH Today And Past IPL Records Match Results: ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం (మార్చి 30) జరిగే తమ రెండవ లీగ్ దశ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ రసవత్తరమైన మ్యాచ్ విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్డేడియంలో జరగనుంది.
డీసీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నాం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. సోమవారం (మార్చి 24) ఇదే గ్రౌండ్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 210 పరుగుల లక్ష్యాన్ని డీసీ 19.3 ఓవర్లలో ఛేదించి ఒక వికెట్ తేడాతో విజయాన్ని సాధించింది. అయితే ఆదివారం మధ్యాహ్నం కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని ఆతిథ్య జట్టు ఆసక్తిగా ఉంది.
మరోవైపు, గురువారం (మార్చి 27) స్వదేశీ అభిమానుల ముందు ఎల్ఎస్‌జీ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైన ఎస్ఆర్‌హెచ్ తిరిగి విజయాల బాట పట్టాలని కోరుకుంటోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో మంచి ఆరంభాలు పొందినప్పటికీ, పెద్దగా రాణించలేకపోయిన మాజీ డీసీ స్టార్ అభిషేక్ శర్మపై ఆరెంజ్ ఆర్మీ భారీ అంచనాలను పెట్టుకుంది.
సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ కోసం, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. ఇదిలా ఉంటే, పాత ఐఎపీఎల్స్ మ్యాచ్‌లో డీసీ, ఎస్ఆర్‌హెచ్ ఎన్నిసార్లు తలపడింది, రికార్డ్స్ ఏంటీ, వాటి గెలుపోటముల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మ్యాచ్‌లు: 24
డీసీ గెలిచింది: 11
ఎస్ఆర్‌హెచ్ గెలిచింది: 13
అత్యధిక స్కోరు: ఏప్రిల్ 20, 2024న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 266/7.
అత్యల్ప స్కోరు: మే 4, 2013న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 80 ఆలౌట్.
అతిపెద్ద విజయం (పరుగుల వారీగా): అక్టోబర్ 27, 2020న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎస్ఆర్‌హెచ్ 88 పరుగుల తేడాతో ఓడించింది.
అతిపెద్ద విజయం (వికెట్ల వారీగా): సెప్టెంబర్ 22, 2021న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో ఓడించింది.
అతి చిన్న విజయం (పరుగుల వారీగా): ఏప్రిల్ 18, 2015న విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల తేడాతో (168 పరుగుల లక్ష్యం) ఓడించింది.
అతి చిన్న విజయం (వికెట్ల వారీగా): మే 8, 2019న విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో ఓడించింది.
అత్యధిక పరుగులు: 19 మ్యాచ్‌ల్లో 571 పరుగులు - ఫాఫ్ డుప్లెసిస్ (ఢిల్లీ క్యాపిటల్స్).
అత్యధిక స్కోరు: మే 10, 2018న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన రిషబ్ పంత్ 63 బంతుల్లో 128 పరుగులు (నాటౌట్).
అత్యధిక వికెట్లు: 13 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు మోహిత్ శర్మ (ఢిల్లీ క్యాపిటల్స్)
ఉత్తమ బౌలింగ్ గణాంకాలు: ఏప్రిల్ 18, 2015న విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన జేపీ డుమిని మూడు ఓవర్లలో 4/17.
పరుగుల వారీగా అత్యధిక భాగస్వామ్యం: మే 10, 2018న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన కేన్ విలియమ్సన్, శిఖర్ ధావన్ మధ్య 2వ వికెట్‌కు 176 పరుగులు జోడించారు.
ఇక ఐపీఎల్ 2024లో ఏప్రిల్ 20న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 67 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.
సంబంధిత కథనం