సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన నవ్వేసింది. వారం క్రితం ఓపెనర్ అభిషేక్ శర్మపై ఆగ్రహంతో ఊగిపోయిన కావ్య.. ఇప్పుడు అతని సెన్సేషనల్ సెంచరీతో నవ్వుల్లో మునిగిపోయింది. శనివారం (ఏప్రిల్ 12) ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో అభిషేక్ శర్మ 141 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. వరుసగా 4 ఓటములు తర్వాత ఆ టీమ్ కు ఇదే ఫస్ట్ విక్టరీ.
ఒక వారం క్రితం అభిషేక్ శర్మ తొలి ఓవర్లోనే ఒక పరుగు చేసి రనౌట్ అయ్యాడు. అప్పుడు కావ్య మారన్ కోపంతో ఊగిపోయింది. ఫ్రస్టేషన్ బయట పెట్టిన వీడియో వైరల్ గా మారింది. దీంతో ఐపీఎల్ 2025 సీజన్లో వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. ఆ సమయంలో ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ కోపంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కానీ శనివారం అభిషేక్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌తో ఆమె ముఖంలో చిరునవ్వు తెచ్చాడు. సన్‌రైజర్స్ వరుస ఓటములకు బ్రేక్ పడటంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు.
అభిషేక్ 10 సిక్స్‌లు, 14 బౌండరీలతో తన తొలి ఐపీఎల్ శతకం సాధించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే భారతీయ బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక స్కోరు. 2013లో క్రిస్ గేల్ చేసిన 175 నాటౌట్, 2008లో బ్రెండన్ మెక్‌కుల్లమ్ చేసిన 158 నాటౌట్ తర్వాత ఇది మూడవ అత్యధిక వ్యక్తిగత స్కోరు.
అభిషేక్ ట్రిపుల్ ఫిగర్‌కు చేరుకున్నప్పుడు, కావ్య ఆనందంతో తన సీటు నుండి లేచి నిలబడి ఎగిరి గంతులేసింది. ఆమె హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఉన్న 24 ఏళ్ల అభిషేక్ తల్లిదండ్రులను కలిసి వారిని అభినందించింది.
అభిషేక్ సీజన్ లో వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాడు. మొదటి ఐదు మ్యాచ్‌లలో కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. అయితే అతను తనను బాగా సహకరించిన కెప్టెన్ పాట్ కమిన్స్, సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు తెలిపాడు. అలాగే కష్టకాలంలో తనతో మాట్లాడిన తన మెంటార్ యువరాజ్ సింగ్, భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.
"ఏ ఆటగాడికీ ఆ ఫామ్‌లో ఉండటం సులభం కాదు. జట్టు, కెప్టెన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. నేను బాగా ఆడకపోయినప్పటికీ, బ్యాట్స్‌మెన్‌కు చాలా సింపుల్ మెసేజ్ ఇచ్చారు. ట్రావిస్‌తో మాట్లాడా. ఇది మా ఇద్దరికీ ప్రత్యేకమైన రోజు" అని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని అందుకున్న తర్వాత అభిషేక్ అన్నాడు. "యువి (పాజీ) కి ప్రత్యేక ధన్యవాదాలు. నేను అతనితో మాట్లాడుతున్నా. సూర్యకుమార్ యాదవ్ కి కూడా ధన్యవాదాలు" అని అభిషేక్ పేర్కొన్నాడు.
సంబంధిత కథనం