IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ నేడే విడుదల.. ఇంకొన్ని గంటల్లోనే అనౌన్స్ మెంట్.. ఏ టైమ్ కు ప్రకటిస్తారంటే?
IPL 2025: క్రికెట్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రాబోతోంది. ఐపీఎల్ 2025 షెడ్యూల్ ను నేడే (ఫిబ్రవరి 16)న ప్రకటించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు షెడ్యూల్ ను అనౌన్స్ చేస్తారు.

ఐపీఎల్ ఫ్యాన్స్ కు సంతోషాన్నిచ్చే వార్త. ఐపీఎల్ 2025 షెడ్యూల్ ను ప్రకటించే సమయం ఆసన్నమైంది. ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఐపీఎల్ షెడ్యూల్ ను అనౌన్స్ చేస్తామని స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విలీనమయ్యి కొత్తగా ఏర్పడిన జియోహాట్ స్టార్ ఓటీటీతో పాటు స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 ఛానెల్లో ఈ షెడ్యూల్ ను ప్రకటించనున్నారు.
కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ
ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుందని సమాచారం. ఈ మ్యాచ్ కు ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిలుస్తుందని తెలుస్తోంది. మార్చి 22న ఐపీఎల్ కొత్త సీజన్ ఆరంభమయ్యే అవకాశం ఉంది. దీనిపై కొన్ని గంటల్లోనే క్లారిటీ రాబోతుంది. అలాగే మే 25న ఫైనల్ జరుగుతుందని, అది కూడా ఈడెన్ గార్డెన్స్ లోనే నిర్వహిస్తారనే ప్రచారం సాగుతోంది.
వైజాగ్ లో మ్యాచ్ లు
క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025లో తన తొలి రెండు మ్యాచ్ లను విశాఖలో ఆడబోతోంది. అక్కడి అభిమానులను మరోసారి ఉర్రూతలూగించేందుకు ఈ ఫ్రాంఛైజీ సిద్ధమవుతోంది.
గత ఐపీఎల్ సీజన్ లో ఈ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్ లు ఆడింది. అప్పుడు డబ్ల్యూపీఎల్ మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చిన ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లకు సిద్ధం కాకపోవడంతో ఆ ఫ్రాంఛైజీ వైజాగ్ ను ఎంచుకుంది.
సంబంధిత కథనం