ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసుకు దూరమయ్యాయి. ఈ రెండు జట్ల మధ్య మంగళవారం (మే 20) నామమాత్రపు పోరు జరగబోతోంది. కానీ ఫ్యాన్స్ ఫోకస్ మొత్తం ఓ వైపు లెజెండ్ ధోని, మరోవైపు 14 ఏళ్ల ఆటగాడు వైభవ్ సూర్యవంశీపై ఉంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, తొమ్మిదో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనున్నాయి. ఐపీఎల్ 2025లో సీఎస్కే దారుణ ప్రదర్శన నేపథ్యంలో ఎంఎస్ ధోని మరో సీజన్ ఆడటం సందేహంగా కనిపిస్తోంది. మహీకి ఇదే లాస్ట్ సీజన్ అనే అంచనాల నేపథ్యంలో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి ధోని ఫ్యాన్స్ పోటెత్తే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2025లో సీఎస్కేకు ఇంకా రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలాయి. 12 మ్యాచ్ లాడిన చెన్నై 3 మాత్రమే గెలిచింది. 9 ఓడింది. ఈ రెండు మ్యాచ్ ల్లో ధోని కోసం ఫ్యాన్స్ స్టేడియాలకు వచ్చే అవకాశముంది. మరోవైపు ఆయుష్ మాత్రె లాంటి కుర్రాడు కూడా అదరగొడుతున్నాడు.
ఐపీఎల్ 2025ను విజయంతో ముగించాలని రాజస్థాన్ రాయల్స్ చూస్తోంది. సీఎస్కే మ్యాచ్ ఆ టీమ్ కు చివరిది. 13 మ్యాచ్ లో ఆర్ఆర్ 3 మాత్రమే గెలిచింది. ఇప్పుడు సీఎస్కేపై గెలిచి గౌరవప్రదంగా మ్యాచ్ ముగించాలనే లక్ష్యంతో ఉంది.
ఈ సీజన్ లో టీమ్ గా రాజస్థాన్ విఫలమైంది. కానీ ఆ టీమ్ లో యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ మాత్రం అదరగొట్టారు. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్ సంచలన శతకం కూడా చేశాడు. ఇంత చిన్న వయసులో అద్భుతమైన బ్యాటింగ్ తో సత్తాచాటుతున్న వైభవ్ సూర్యవంశీ చివరి మ్యాచ్ లో ఏం చేస్తాడో చూడాాలి. ఈ కుర్రాడు ఇప్పటికే ఫ్యూచర్ స్టార్ అవుతాడనే అంచనాలు పెంచేశాడు.
సంబంధిత కథనం