ఓ మహత్తర కార్యక్రమం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నడుం బిగించింది. ఎప్పటిలాగే ఐపీఎల్ సీజన్లో మరోసారి గ్రీన్ జెర్సీని ధరించింది. గ్రీన్ ఇన్షియేటివ్ ప్రోగ్రామ్ లో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఆర్సీబీ ప్రతి ఏటా ఇలా ఓ మ్యాచ్ లో గ్రీన్ జెర్సీతో ఆడుతోంది. ఆదివారం (ఏప్రిల్ 13) జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ ప్లేయర్స్ గ్రీన్ జెర్సీ వేసుకుని ఆడారు.
రీసైకిల్ చేసిన ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన ఈ జెర్సీలు పర్యావరణ పరిరక్షణ కోసం ఆర్సీబీ కమిట్ మెంట్ ను చాటుతున్నాయి. ఆర్సీబీ కార్బన్-న్యూట్రల్ ఫ్రాంచైజీ. పర్యావరణంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించాలనే లక్ష్యంతో ఆ టీమ్ పని చేస్తోంది. అందుకే ప్రతి ఏటా ఓ మ్యాచ్ లో ఇలా గ్రీన్ జెర్సీ వేసుకుని ఆడుతోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీఈఓ రాజేశ్ మీనన్ మాట్లాడుతూ 'పిచ్ లోపలా, బయటా ధైర్యంగా ఉండటమే మాకు ముఖ్యం. మా ఆకుపచ్చ జెర్సీలు కేవలం చిహ్నం మాత్రమే కాదు పర్యావరణ హిత చర్యలకు పిలుపునిస్తున్నాయి. గార్డెన్ సిటీ గర్వించదగిన ప్రతినిధులుగా సుస్థిరత మాకు సహజ ప్రాధాన్యత. అవగాహన పెంచడానికి, పరిరక్షణ దిశగా అడుగులు వేసేలా అభిమానులు ప్రేరేపించడమే లక్ష్యం’’ అని పేర్కొన్నారు.
ఆర్సీబీ సుస్థిరత ప్రయత్నాలు సమగ్రంగా ఉండటమే కాకుండా పక్కా డేటాతో సాగుతున్నాయి. ఐపీఎల్ సమయంలో రెగ్యులర్ కార్బన్ ఆడిట్ నిర్వహించడంతో పాటు పర్యావరణంలో వీటి ప్రభావాన్ని కూడా మానిటర్ చేస్తోంది. డీజిల్ జనరేటర్ ద్వారా స్టేడియంలో, బయట వెల్లడయ్యే ఉద్గారాలను తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడూ సర్వేలు నిర్వహిస్తోంది. మ్యాచ్ ను చూసేందుకు వచ్చే ప్రేక్షకుల ప్రయాణం కారణంగా వెలువడే ఉద్గారాలపై అంచనాలను వెల్లడిస్తోంది.
ఆర్సీబీ టీమ్ వెల్లడించే కార్బన ఉద్గారాలపైనా మేనేజ్ మెంట్ దృష్టి సారించింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, చీర్ స్క్వాడ్ జర్నీని క్షుణ్ణంగా అంచనా వేస్తారు. ప్రతి గది నుంచి వెల్లడయ్యే ఉద్గారాలపై ప్రతి రాత్రి విశ్లేషిస్తారు. అంతేకాక, స్టేడియంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాల నుండి ఉద్గారాలను వ్యర్థ రకం ఆధారంగా లెక్కిస్తారు. వాటి పర్యావరణ ప్రభావం యొక్క ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
స్టేడియంలో వ్యర్థాల నిర్వహణ, విభజన, సౌరశక్తితో నడిచే లైటింగ్, పవన శక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, సంప్రదాయ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఇతర కార్యక్రమాలతో సహా కార్బన్ ఆఫ్ సెట్ ను ఎదుర్కోవడానికి ఆర్సీబీ అనేక చర్యలను అమలు చేస్తోంది.
సంబంధిత కథనం