Rohit Sharma IPL 2025: మిషన్ ఐపీఎల్.. గ్యాంగ్‌స్టర్ రోహిత్.. స్టైలిష్ లుక్ లో హిట్ మ్యాన్ ఎంట్రీ.. వీడియో వైరల్
Rohit Sharma IPL 2025: ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్ 2025 కోసం రంగంలోకి దిగాడు. రోహిత్ ఎంట్రీపై ముంబయి ఇండియన్స్ రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2025 కోసం హిట్ మ్యాన్ రంగంలోకి దిగాడు. రోహిత్ శర్మ ఎంట్రీపై ముంబయి ఇండియన్స్ రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో వైరల్ గా మారుతోంది. గ్యాంగ్ స్టర్ లా రోహిత్ లుక్ అదిరిపోయింది. బ్లాక్ కోట్ లో, నల్లటి షేడ్స్ తో.. మెడలో టైతో.. చేతిలో బ్యాట్ పట్టుకుని రోహిత్ నడిచి వస్తున్న విజువల్ ఫ్యాన్స్ కు కిక్కిస్తోంది.
స్పెషల్ బౌంటీ
హోటల్లో స్పెషల్ బౌంటీ ఉన్నాడంటూ స్టార్ట్ అయిన వీడియో హిట్ మ్యాన్ కు వేరే లెవల్ ఎలివేషన్ ఇస్తోంది. రోహిత్ శర్మ ను పట్టుకునేందుకు మనుషులు వెళ్లడం.. అతను చేతిలో బ్యాట్ తో ఎంట్రీ ఇవ్వడం స్పెషల్ గా నిలిచింది. ముంబయి ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. రోహిత్ స్టైల్ అండ్ స్వాగ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
మాల్దీవ్స్ నుంచి
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాను విజేతగా నిలిపిన రోహిత్ ఆ తర్వాత వెకేషన్ కు మాల్దీవ్స్ కు వెళ్లాడు. అక్కడ ఫ్యామిలీతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేశాడు. బీచ్ లో సేద తీరాడు. మళ్లీ ఐపీఎల్ బిజీ షెడ్యూల్ కోసం ఫ్రెష్ గా రెడీ అయ్యాడు. ఐపీఎల్ 2025 కు మరికొన్ని రోజులు మాత్రమే టైం ఉండటంతో రోహిత్ టీమ్ తో చేరాడు. మార్చి 22న ఐపీఎల్ 18వ సీజన్ స్టార్ట్ అవుతుంది.
ఆరో టైటిల్ పై గురి
ఐపీఎల్ లో టైటిళ్ల సిక్సర్ కొట్టాలని ముంబయి ఇండియన్స్ టార్గెట్ పెట్టుకుంది. ఆ టీమ్ ఇప్పటికే అయిదు సార్లు ఛాంపియన్ గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ తో కలిసి ఈ లీగ్ హిస్టరీలో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా ముంబయి కొనసాగుతోంది. ఈ సీజన్ కు ముందు ఆ టీమ్ రోహిత్, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్, తిలక్ వర్మ, బుమ్రాను రిటైన్ చేసుకుంది.
కెప్టెన్ సూర్య
ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ తన తొలి మ్యాచ్ లో మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ కు సూర్య కుమార్ కెప్టెన్. 2024 ఐపీఎల్ సీజన్లో ముంబయి ఇండియన్స్ చివరి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడింది. ఆ మ్యాచ్ లో ముంబయి స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పై శిక్ష పడింది. మూడోసారి అలా జరగడంతో ముంబయి కెప్టెన్ హార్దిక్ పై ఓ మ్యాచ్ నిషేధం పడింది. రూ.30 లక్షల జరిమానా కూడా విధించారు. అందుకే ఈ సీజన్ లో ముంబయి తొలి మ్యాచ్ లో హార్దిక్ ఆడటం లేదు.
సంబంధిత కథనం