ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. ఓ మార్పు చేసిన ముంబై.. తుది జట్లు ఇలా.. వాన ముప్పు!-ipl 2025 qualifier 2 mi vs pbks punjab kings won the toss against mumbai indians ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. ఓ మార్పు చేసిన ముంబై.. తుది జట్లు ఇలా.. వాన ముప్పు!

ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. ఓ మార్పు చేసిన ముంబై.. తుది జట్లు ఇలా.. వాన ముప్పు!

ఐపీఎల్ 2025లో ముంబై, పంజాబ్ మధ్య క్వాలిఫయర్ 2 పోరు షురూ అయింది. ఫైనల్‍‍లో అడుగుపెట్టేందుకు జరుగుతున్న ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచింది పంబాబ్ కింగ్స్.

ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. ఓ మార్పు చేసిన ముంబై.. తుది జట్లు ఇలా.. (AP)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‍ ఫైనల్‍లో ఎంట్రీ ఇచ్చేందుకు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడేందుకు బరిలోకి దిగాయి. ఈ క్వాలిఫయర్ 2లో గెలిచిన జట్టు ఫైనల్‍లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. అహ్మదాబాద్‍లోని నరేంద్ర స్టేడియం వేదికగా నేడు (జూన్ 1) ముంబై, పంజాబ్ మధ్య ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 పోరు మొదలైంది. ఈ క్వాలిఫయర్ 2 మ్యాచ్‍లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి, ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్‍కు దిగనుంది.

ఓ ఛేంజ్ చేసిన ముంబై

గత మ్యాచ్‍తో పోలిస్తే ఈ క్వాలిఫయర్-2 కోసం తుది జట్టులో ఓ మార్పు చేసింది ముంబై ఇండియన్స్. పేసర్0 రిచర్డ్ గ్లెసెన్ స్థానంలో రీస్ టాప్లీని తీసుకుంది. ఫిట్‍నెస్ ఇబ్బందితో గ్లెసెన్ ఈ మ్యాచ్‍కు దూరమయ్యాడని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ సమయంలో చెప్పాడు.

వర్షం ముప్పు

కీలకమైన ఈ క్వాలిఫయర్-2 మ్యాచ్‍కు వర్షం ముప్పు కూడా పొంచి ఉంది. వాన వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‍కు రిజర్వే డే లేదు. ఒకవేళ వాన వల్ల రద్దయితే పంజాబ్ ఫైనల్‍కు వెళుతుంది. మరి వరుణుడు కరుణిస్తాడేమో చూడాలి.

ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఉత్కంఠ పోరులో గెలిచి క్వాలిఫయర్-2లో ముంబై అడుగుపెట్టింది. ఆల్‍రౌండ్ ప్రదర్శనతో రాణించింది హార్దిక్ పాండ్యా టీమ్. క్వాలిఫయర్-1లో బెంగళూరు చేతిలో ఓడిన పంజాబ్ సత్తాచాటాలని పట్టుదలగా ఉంది. రెండో క్వాలిఫయర్‌లో గెలిచి ఫైనల్‍లో అడుగుపెట్టాలని శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కసిగా ఉంది. ఈ నాకౌట్ పోరులో గెలిచిన జట్టు తుదిపోరులో బెంగళూరుతో పోటీ పడుతుంది. ఓడిన జట్టు నిష్క్రమిస్తుంది.

తుదిజట్లు ఇలా..

ముంబై ఇండియన్ తుదిజట్టు: రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్‍ధీర్, రాజ్ బావా, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్‍ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీ

పంజాబ్ కింగ్స్ తుదిజట్టు: జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టొయినిస్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జెమీసన్, విజయ్‌ కుమార్ వైశాఖ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం