హడలెత్తించిన హేజిల్ వుడ్, యశ్.. తిప్పేసిన సుయాష్.. పంజాబ్ కింగ్స్ ఢమాల్.. క్వాలిఫయర్ 1లో ఆర్సీబీకి ఈజీ టార్గెట్-ipl 2025 qualifier 1 rcb vs pbks hazlewood yash dayal suyash sharma fiery bowling punjab kings all out for 101 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  హడలెత్తించిన హేజిల్ వుడ్, యశ్.. తిప్పేసిన సుయాష్.. పంజాబ్ కింగ్స్ ఢమాల్.. క్వాలిఫయర్ 1లో ఆర్సీబీకి ఈజీ టార్గెట్

హడలెత్తించిన హేజిల్ వుడ్, యశ్.. తిప్పేసిన సుయాష్.. పంజాబ్ కింగ్స్ ఢమాల్.. క్వాలిఫయర్ 1లో ఆర్సీబీకి ఈజీ టార్గెట్

వారెవా బౌలింగ్. ఏమా ఆధిపత్యం. బంతితో ఆర్సీబీ అదరగొట్టింది. క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్ ను హడలెత్తించింది. ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు పంజాబ్ తక్కువ స్కోరుకే ఆలౌటైంది.

తిప్పేసిన సుయాష్ శర్మ (AFP)

ఆర్సీబీ అదుర్స్. ఆ టీమ్ బౌలింగ్ అమేజింగ్. పిచ్ కండీషన్లను బెటర్ గా యూజ్ చేసుకున్న ఆర్సీబీ.. పంజాబ్ కింగ్స్ ను వణకించింది. హోం గ్రౌండ్ ముల్లాన్ పూర్ లో ఆడుతున్నప్పటికీ గురువారం (మే 29) పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లో బొక్కబోర్లా పడింది. క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ బౌలర్ల ధాటికి 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది.

సుయాష్ శర్మ, హేజిల్ వుడ్ మూడేసి వికెట్లు పడగొట్టడా.. యశ్ దయాల్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఈజీ టార్గెట్ ఛేదించాల్సిన ఉన్న ఆర్సీబీ ఐపీఎల్ 2025లో ఫైనల్లో ఒక అడుగు పెట్టినట్లే.

వణికించిన పేసర్లు

పంజాబ్ కింగ్స్ హోం గ్రౌండ్. పైగా ఆ టీమ్ ఫస్ట్ బ్యాటింగ్. ధనాధన్ ఇన్నింగ్స్ లతో అదరగొడతారని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఆర్సీబీ పేసర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు వణికిపోయారు. బుల్లెట్ లాంటి బంతులను ఆడలేక పెవిలియన్ కు క్యూ కట్టారు. స్టార్ బ్యాటర్లు ఔటై వెళ్లిపోతుంటే స్టేడియం సైలెంట్ అయిపోయింది.

యశ్ మొదలెట్టాడు

పంజాబ్ కింగ్స్ వికెట్ల పతనాన్ని ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్ మొదలెట్టాడు. యువ సంచలన ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (7) వికెట్ ను సాధించాడు యశ్. అక్కడి నుంచి వరుసగా వికెట్లు పడుతూనే వచ్చాయి. స్టార్టింగ్ లో పిచ్ నుంచి సహకారాన్ని యూజ్ చేసుకుంటూ ఆర్సీబీ పేసర్లు మంచి స్వింగ్ రాబట్టారు. బంతి పడటం, బ్యాట్ ను తాకడం, గాల్లోకి ఎగరడం.. ఇదే వరస. ప్రభ్ సిమ్రన్ (18)ను ఔట్ చేసి భువనేశ్వర్.. పంజాబ్ కు డబుల్ షాకిచ్చాడు.

హేజిల్ వుడ్ మ్యాజిక్

గాయంతో గత కొన్ని మ్యాచ్ లకు దూరమైన డేంజరస్ పేసర్ హేజిల్ వుడ్ తన వాల్యూను మరోసారి చాటాడు. రీ ఎంట్రీలో అదరగొట్టాడు. తన వరుస ఓవర్లలో అదరగొట్టారు. ముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (2) వికెట్ తో ప్రత్యర్థి టీమ్ ను చావుదెబ్బ కొట్టాడు హేజిల్ వుడ్. ఆ తర్వాతి ఓవర్లో టాప్ ఎడ్జ్ తో ఇంగ్లిస్ ను పెవిలియన్ చేర్చాడు. నేహాల్ వధెరా (8)ను యశ్ ఔట్ చేయడంతో పంజాబ్ 50/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది.

తిప్పేసిన సుయాష్

అప్పటివరకూ పేసర్ల దెబ్బకు హడలెత్తిన పంజాబ్ కింగ్స్.. ఆ తర్వాత స్పిన్నర్ సుయాష్ శర్మ మ్యాజిక్ కు బోల్తా కొట్టింది. సుయాష్ ఒకే ఓవర్లో శశాంక్ సింగ్ (3), ఇంపాక్ట్ ప్లేయర్ ముషీర్ ఖాన్ (0)ను పెవిలియన్ చేర్చి సంబరాల్లో తేలిపోయాడు. దీంతో పంజాబ్ కు దెబ్బ మీద దెబ్బ పడింది. తన తర్వాతి ఓవర్లోనే మార్కస్ స్టాయినిస్ 26) పోరాటానికి ఎండ్ కార్డు వేశాడు సుయాష్.

హర్ ప్రీత్ బ్రార్ (4)ను షెఫర్డ్ ఔట్ చేశాడు. అజ్మతుల్లా ఒమర్ జాయ్ (18) పోరాటంతో పంజాబ్ స్కోరు 100 దాటింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం