ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్.. ట్విస్ట్ అదిరింది.. ఒక్క బెర్తు.. మూడు టీమ్స్.. ఏ జట్టు ఛాన్స్ ఎంత? దక్కేది ఎవరికో?-ipl 2025 play offs race became more interesting three teams for one berth mumbai indians delhi capitals lucknow ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్.. ట్విస్ట్ అదిరింది.. ఒక్క బెర్తు.. మూడు టీమ్స్.. ఏ జట్టు ఛాన్స్ ఎంత? దక్కేది ఎవరికో?

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్.. ట్విస్ట్ అదిరింది.. ఒక్క బెర్తు.. మూడు టీమ్స్.. ఏ జట్టు ఛాన్స్ ఎంత? దక్కేది ఎవరికో?

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. నిన్నటి వరకూ 4 బెర్తుల కోసం 7 టీమ్స్ పోటీపడ్డాయి. కానీ ఒక్క రోజులోనే కథ మారిపోయింది. మూడు జట్లు ప్లేఆఫ్స్ వెళ్లిపోయాయి. ఇప్పుడు మిగిలిన బెర్తు కోసం మూడు టీమ్స్ తలపడుతున్నాయి. మరి ఏ జట్టు అవకాశం ఎలా ఉందో ఓ లుక్కేయండి.

డీసీ కెప్టెన్ అక్షర్, ఎంఐ సారథి హార్దిక్, లక్నో నాయకుడు పంత్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరుకున్నాయి. ఆదివారం (మే 18) జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ పై 10 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలిచింది. దీంతో గుజరాత్, పంజాబ్ తో పాటు ఆర్సీబీ కూడా ప్లేఆఫ్స్ చేరిపోయింది.

ఒక్కటే బెర్తు

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించేశాయి. ఇక మిగిలింది ఒకే ప్లేస్. ఈ బెర్తు కోసం ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడుతున్నాయి. ఈ టీమ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

ముంబయి ఇండియన్స్ - 12 మ్యాచ్ ల్లో 14 పాయింట్లు

మిగిలిన మ్యాచ్ లు: డీసీ, పీబీకేఎస్

హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబయి ఇండియన్స్ మిగతా ఢిల్లీ, లక్నో కంటే బెటర్ గా ఉంది. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. వాస్తవానికి సొంతగడ్డపై ఢిల్లీని మరోసారి ఓడించినా ముంబయికి ఛాన్స్ ఉంటుంది.. అప్పుడు లక్నో మూడు మ్యాచ్ ల్లో ఒకటి ఓడిపోవాలి. అయితే ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఓడినా చివరి మ్యాచ్ లో పంజాబ్ పై విజయం సాధించినా ముంబయి ముందంజ వేయలేదు.

ఢిల్లీ క్యాపిటల్స్ - 12 మ్యాచ్ ల్లో 13 పాయింట్లు

మిగిలిన మ్యాచ్ లు: ఎంఐ, పీబీకేఎస్

ఢిల్లీ ఐపీఎల్ 2025 సీజన్ ను గొప్పగా ప్రారంభించింది. మొదటి నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. సీజన్లో ఎక్కువ భాగం టాప్ హాఫ్లోనే కొనసాగింది. అయితే గత ఎనిమిది మ్యాచ్ ల్లో ఐదింటిలో ఓడిపోవడంతో టాప్-4కు దూరమై ఇప్పుడు ఎలిమినేషన్ అంచున నిలిచింది. క్వాలిఫికేషన్ లో ఉన్న ఏకైక లక్ష్యం రెండు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించడం. ఒక్క మ్యాచ్ లో ఓడినా ఆ టీమ్ పనైపోతుంది.

లక్నో సూపర్ జెయింట్స్ - 11 మ్యాచ్ ల్లో 10 పాయింట్లు

మిగిలిన మ్యాచ్ లు: ఎస్ ఆర్ హెచ్, జీటీ, ఆర్సీబీ

ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో పోలిస్తే లక్నో ఒక మ్యాచ్ ఎక్కువగా ఆడనుంది. అయినా ప్లేఆఫ్స్ దిశగా ఆ టీమ్ ఫేవరెట్ గా లేదు. గత ఐదు మ్యాచ్ లలో నాలుగింటిలో ఓడిపోయింది లక్నో. మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలిచినా ఎల్ఎస్జీ 16 పాయింట్లతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఢిల్లీ, ముంబయి తమ మ్యాచ్ ల్లో ఓడిపోవాలి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం