డిఫెండింగ్ ఛాంపియన్ తో పంజాబ్ ఢీ.. టాస్ గెలిచిన శ్రేయస్.. టీమ్ లోకి కొత్త ప్లేయర్
ఐపీఎల్ 2025లో నేడు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ 2025లో మరో మ్యాచ్ కు టైమ్ ఆసన్నమైంది. ఈ సీజన్ లో తడబడుతూ సాగుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య నేడు మ్యాచ్ జరుగుతోంది. మంగళవారం (ఏప్రిల్ 15) ముల్లాన్ పూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
అదే అలవాటు
ఐపీఎల్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ జర్నీ గెలుపు, ఓటములతో సాగుతోంది. ఒక మ్యాచ్ లో ఓడితే, ఇంకో మ్యాచ్ లో గెలుస్తోంది. ఆడిన ఆరు మ్యాచ్ ల్లో మూడు గెలిచి, మూడు ఓడింది. మరి గత మ్యాచ్ లో సీఎస్కేను చిత్తు చేసిన కేకేఆర్.. ఈ మ్యాచ్ లో కూడా ఓడి సెంటిమెంట్ కొనసాగిస్తుందా? గెలిచి జోరు ప్రదర్శిస్తుందా? అన్నది చూడాలి.
ఆ టీమ్ కు స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి కీలకంగా మారారు. చెపాక్ లో జరిగిన మ్యాచ్ లో ఆ టీమ్ మొయిన్ అలీని కూడా ఆడించింది. మరోవైపు బ్యాటింగ్ లో మాత్రం నిలకడ కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్ కోసం మొయిన్ అలీ ప్లేస్ లో పేసర్ నోకియాను కేకేఆర్ ఆడిస్తోంది.
శ్రేయస్ పై ఫోకస్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఐపీఎల్ లో కొత్తగా జర్నీ స్టార్ట్ చేసిన శ్రేయస్ అయ్యర్ పై ఫోకస్ ఉంది. ఆ టీమ్ ఆడిన 5 మ్యాచ్ ల్లో మూడు గెలిచి, రెండు ఓడింది. గత మ్యాచ్ లో సన్ రైజర్స్ చేతిలో చిత్తయింది. ఉప్పల్ స్టేడియంలో అభిషేక్ శర్మ సెన్సేషనల్ సెంచరీతో పంజాబ్ కింగ్స్ కు నిరాశ తప్పలేదు.
పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్.. బ్యాటింగ్ లో దూకుడు కొనసాగిస్తున్నాడు. 5 ఇన్నింగ్స్ ల్లో 208 స్ట్రైక్ రేట్ తో 250 పరుగులు చేశాడు. కుర్రాళ్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ కూడా సత్తాచాటుతున్నారు. బౌలింగ్ లో మాత్రం ఈ టీమ్ మరింత బెటర్ పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంది. గాయంతో సీజన్ కు దూరమైన ఫెర్గూసన్ స్థానంలో జేవియర్ డెబ్యూ చేయబోతున్నాడు. స్టాయినిస్ స్థానంలో ఇంగ్లిస్ టీమ్ లోకి వచ్చాడు.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్, శ్రేయస్, ఇంగ్లిస్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మ్యాక్స్ వెల్, యాన్సెన్, జేవియర్, అర్ష్ దీప్, చాహల్.
కోల్ కతా నైట్ రైడర్స్: డికాక్, నరైన్, వెంకటేశ్ అయ్యర్, రహానె, రింకు సింగ్, రసెల్, రమణ్ దీప్, వైభవ్ అరోరా, నోకియా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
సంబంధిత కథనం