ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీ కన్నుల పండుగగా సాగుతోంది. వర్షం కారణంగా ఈ ప్రోగ్రామ్ రద్దవుతుందేమోననే ఆందోళన మొదట నెలకొంది. కానీ వరుణుడు శాంతించడం.. మధ్యాహ్నం నుంచి ఎండ కాయడంతో టెన్షన్ పోయింది. షెడ్యూల్ ప్రకారం కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లోని ప్రారంభోత్సవ వేడుకులు గ్రాండ్ గా స్టార్ట్ అయ్యాయి. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఐపీఎల్ కు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గ్రాండ్ ఇంట్రోతో ఎలివేషన్ ఇచ్చాడు. అనంతరం ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ సాంగ్స్ తో స్టేడియం దద్దరిల్లింది.
కలర్ ఫుల్ లైట్ల వెలుగులో ఐపీఎల్ 2025 సీజన్ ఓపెనింగ్ సెర్మనీ స్టార్ట్ అయింది. మొదట కేకేఆర్ ఓనర్, బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ స్టేజీ మీదకు వచ్చాడు. ఫ్యాన్స్ కు వెల్ కమ్ చెప్పాడు. ప్రపంచంలోనే గ్రేటెస్ట్ లీగ్ మళ్లీ వచ్చేసిందని పేర్కొన్నాడు. ఐపీఎల్ తో క్రికెట్ కే కొత్త రూపు వచ్చిందని షారుక్ అన్నాడు. ఈ ఈవెంట్ ను మ్యూజికల్ ట్రీట్ తో మొదలెట్టేందుకు శ్రేయా ఘోషల్ వస్తుందంటూ ఈ లేడీ సింగర్ ను పిలిచాడు.
ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీలో శ్రేయా ఘోషల్ మ్యూజికల్ ట్రీట్ ఫ్యాన్స్ ను ఎంతగానో అలరించింది. బాలీవుడ్ సూపర్ హిట్ పాటలను ఆమె ఆలపిస్తుంటే ఫ్యాన్స్ కేరింతలతో స్టేడియం మార్మోగింది. ‘గూమర్’, ‘జిందా హై’, ‘ఓం శాంతి ఓం’, ‘డోల్ భాజే’, ‘వందేమాతరం’ తదితర హిట్ సాంగ్స్ తో శ్రేయా ఘోషల్ స్టేడియాన్ని ఊపేసింది. మధ్యలో పుష్ఫ 2 మూవీ నుంచి ‘సూసేకి అగ్గిరవ్వ’ మాదిరి సాంగ్ ను ఆమె తెలుగులో పాడటం విశేషం. శ్రేయా ఘోషల్ ‘మా తుజే సలాం’ అంటూ పాడుతుంటే గుస్ బంబ్స్ వచ్చాయి. ఆ సాంగ్ తో ఆమె మ్యూజికల్ కాన్సర్ట్ ముగిసింది.
బాలీవుడ్ గ్లామర్ క్వీన్ దిశా పటాని డ్యాన్స్ తో ఫ్యాన్స్ ను హోరెత్తించింది. ఈ భామ గ్లామర్ షోకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. హిందీ హిట్ సాంగ్స్ కు దిశా హాట్ డ్యాన్స్ తో అదరగొట్టాడు. అనంతరం ప్రముఖ ర్యాపర్ కరణ్ ఈ ఓపెనింగ్ సెర్మనీ జోష్ ను కొనసాగించాడు. ‘తోబా తోబా’ సాంగ్ తో స్టేడియంలోని ఫ్యాన్స్ తో కరణ్ డ్యాన్స్ చేయించాడు.
ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. గతేడాది ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి కేకేఆర్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 2008 ఐపీఎల్ తర్వాత ఓ సీజన్ తొలి మ్యాచ్ లో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ తలపడటం ఇదే మొదటిసారి. ఈ రెండు టీమ్స్ కొత్త కెప్టెన్లతో బరిలో దిగుతున్నాయి. కోల్ కతాకు అజింక్య రహానె, ఆర్సీబీకి రజత్ పాటీదార్ కెప్టెన్.
సంబంధిత కథనం