IPL 2025 Opening Ceremony: ప్రతి ఏటా సమ్మర్ లో రెండు నెలల పాటు క్రికెట్ వినోదం పంచే ఐపీఎల్ ఇప్పుడు 18వ సీజన్ తో రాబోతోంది. శనివారం (మార్చి 22) ఈ మెగా లీగ్ ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగబోయే ఈ సెర్మనీకి.. ఎంతో మంది స్టార్లు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీకి బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, శ్రద్ధా కపూర్ లాంటి వాళ్లు రాబోతున్నారు. వీళ్లు కాకుండా అమెరికన్ పాప్ బ్యాండ్ వన్ రిపబ్లిక్ కూడా పర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ ఆర్గనైజర్ల సన్నిహిత వర్గాలు ఈ సెర్మనీ గురించి కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించాయి.
“స్టార్ల రాకతో ఈ సెర్మనీకి మరింత కళ రానుంది. తన టీమ్ తొలి మ్యాచ్ లో ఆడుతుండటంతో షారుక్ ఖాన్ వస్తున్నాడు. ఇక తన మూవీ సికందర్ ప్రమోషన్లలో భాగంగా సల్మాన్ ఖాన్ కూడా రానున్నాడు. శ్రేయా ఘోషాల్, దిశా పటానీ, కరణ్ ఔజ్లా, అరిజిత్ సింగ్, శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ లాంటి వాళ్లు ఓపెనింగ్ సెర్మనీలో పర్ఫామ్ చేయబోతున్నారు” అని ఆ వర్గాలు తెలిపాయి.
ఈ ఓపెనింగ్ సెర్మనీకి మరికొందరు గెస్టులు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. వీళ్లలో కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రా, తృప్తి డిమ్రి, అనన్య పాండే, మాధురి దీక్షిత్, జాన్వీ కపూర్, ఊర్వశి రౌతేలా, పూజా హెగ్డే, కరీనా కపూర్, ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ లాంటి వాళ్లు కూడా రాబోతున్నారు.
ఐపీఎల్ 18వ సీజన్ జరగనుంది. ఈ నెల 22 నుంచి మే 25 వరకు మెగా లీగ్ జరగబోతోంది. మొత్తంగా 74 మ్యాచ్ లు జరుగుతాయి. 13 వేదికల్లో ఈ మ్యాచ్ లు ఉంటాయి. 12 రోజులు రోజుకు రెండు మ్యాచ్ లు జరుగుతాయి. తొలి మ్యాచ్ కోల్‌కతాలో ని ఈడెన్ గార్డెన్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది.
ఈసారి కూడా పది టీమ్స్ ను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్ లు ఆడించనున్నారు. తొలి మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చే ఈడెన్ గార్డెన్సే ఫైనల్ కు కూడా ఆతిథ్యమివ్వనుంది. ఇక్కడే రెండో క్వాలిఫయర్ కూడా జరుగుతుంది.
సంబంధిత కథనం