IPL 2025 DC vs LSG: ఐపీఎల్ 2025లో అటు వాళ్లు ఇటయ్యారు.. ఇటు వాళ్లు అటయ్యారు. అలా తాజాగా సోమవారం (మార్చి 24) ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్స్ తలపడబోతున్నాయి. గత సీజన్ వరకూ డీసీతో ఉన్న రిషబ్ పంత్ ఇప్పుడు లక్నో తరఫున, లక్నో తరఫున ఆడిన కేఎల్ రాహుల్ డీసీ తరఫున బరిలోకి దిగుతున్నారు. దీంతో అందరి కళ్లూ ఈ ఇద్దరిపైనే ఉన్నాయి.
ఈ ఐపీఎల్ సీజన్లో చాలా టీమ్స్ కెప్టెన్లు మారిపోయారు. సోమవారం (మార్చి 24) తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్స్ కెప్టెన్లు కూడా మారారు. ఢిల్లీకి అక్షర్ పటేల్, లక్నోకు రిషబ్ పంత్ కెప్టెన్లుగా ఉన్నారు. ఇప్పుడీ రెండు టీమ్స్ మధ్య వార్ ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ గత 17 సీజన్లుగా ఆడుతున్నా ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోలేదు.
ఇటు లక్నో 2022లో అడుగుపెట్టగా.. మూడు సీజన్లపాటు ట్రోఫీని సాధించలేకపోయింది. ఇప్పుడు కొత్త టీమ్స్, కొత్త కెప్టెన్లు, కొత్త కోచ్ ల నేతృత్వంలో ఎలా ఆడతాయో చూడాలి. లక్నో టీమ్ ఓనర్ చేతుల్లో అవమానపడి ఆ ఫ్రాంఛైజీ నుంచి తప్పుకున్న కేఎల్ రాహుల్.. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. తన సీజన్ తొలి మ్యాచ్ లోనే తన పాత టీమ్ పై ఆడుతుండటంతో అతడు చెలరేగుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీ క్యాపిటల్స్ కొన్ని సీజన్లుగా తన రెండో హోమ్ గ్రౌండ్‌గా విశాఖపట్నాన్ని ఎంచుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్ విశాఖలోనే జరగనుంది. రెండు టీమ్స్ లోనూ మంచి హిట్టర్లు ఉండటంతో ఇందులో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ లో జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్ లాంటి వాళ్లు ఉండగా.. అటు లక్నో సూపర్ జెయింట్స్ లో మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, నికొలస్ పూరన్, డేవిడ్ మిల్లర్ లాంటి వాళ్లు ఉన్నారు. టీమిండియా తరఫున ఈ మధ్య మిడిలార్డర్ లో ఆడుతున్నట్లే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున్ కూడా మిడిల్ లోనే అతడు బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.
జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఫాఫ్ డుప్లెస్సి, అభిషేక్ పొరెల్, కేెఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, నటరాజన్
యువరాజ్ చౌదరి, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, నికొలస్ పూరన్, ఆయుష్ బదోనీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, రాజ్‌వర్దన్ హంగర్గేకర్, రవి బిష్ణోయ్, షమర్ జోసెఫ్
సంబంధిత కథనం