ఓ వైపు ముంబయి ఇండియన్స్.. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్. ఒక్క ప్లేఆఫ్ బెర్తు కోసం పోటీపడుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ అవకాశాలు ప్రమాదంలోనే ఉన్నాయి. ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉన్న ఢిల్లీ ఒక్కటి ఓడినా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. బుధవారం (మే 21) వాంఖడేలో ముంబయి, ఢిల్లీ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది.
తీవ్రమైన ఫ్లూ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. సీనియర్ ప్లేయర్ డుస్లెసిస్ ఈ మ్యాచ్ లో ఢిల్లీకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అతనే టాస్ కు వచ్చాడు. టాస్ గెలిచిన డుప్లెసిస్ ఛేజింగ్ కే మొగ్గు చూపాడు.
ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ 12 మ్యాచ్ ల్లో 7 విజయాలతో కొనసాగుతోంది. ఆ టీమ్ ఖాతాలో 14 పాయింట్లున్నాయి. ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉన్న ముంబయికి ప్లేఆఫ్స్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీని ఓడిస్తే ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరుతుంది. ఢిల్లీ ఇంటిముఖం పడుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్ ల్లో ఆరు గెలిచింది. అయిదు ఓడింది. ఒకటి వర్షంతో రద్దయింది. 13 పాయింట్లతో పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతోంది. ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ముంబయి ఇండియన్స్ చేతిలో ఓడితే ఢిల్లీ ప్లేఆఫ్స్ కు దూరమవుతుంది. ముంబయి పై గెలిస్తే ఢిల్లీకి ఛాన్స్ ఉంటుంది.
ఈ మ్యాచ్ లో ముంబయి పై ఢిల్లీ గెలిస్తే ప్లేఆఫ్ బెర్తు కోసం పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది. ముంబయి, ఢిల్లీ.. తమ చివరి మ్యాచ్ ల్లో పంజాబ్ కింగ్స్ తో తలపడనున్నాయి. ముంబయిపై ఢిల్లీ గెలిస్తే ఆ టీమ్ ఖాతాలో 15 పాయింట్లు చేరుతాయి. ముంబయి 14 పాయింట్లతో ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ లో పంజాబ్ పై ఢిల్లీ గెలిస్తే.. ముంబయి విజయంతో పని లేకుండా ముందంజ వేస్తుంది. ఒకవేళ ఢిల్లీ ఓడి, ముంబయి గెలిస్తే.. ముంబయి ప్లేఆఫ్స్ చేరుతుంది.
వాంఖడే మైదానంలో జరిగే మ్యాచ్ సందర్భంగా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ముంబయిలో నాలుగు రోజుల పాటు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. 1.5 గంటల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అక్యూ వెదర్ తెలిపింది.
మ్యాచ్ వాష్ ఔట్ అయితే ఢిల్లీ 14 పాయింట్లతో, ముంబయి 15 పాయింట్లకు చేరుకుంటుంది. ఆ ఒక్క పాయింట్ భారీ ప్రభావాన్ని చూపుతుంది. ముంబయి అర్హత అవకాశాలను పెంచుతుంది. అదే సమయంలో ఢిల్లీ పై ఎఫెక్ట్ పడుతుంది.
సంబంధిత కథనం