ఆఖర్లో పిడుగులా.. వారెవా సూర్య.. ముంబయి బ్యాటర్ అద్భుత పోరాటం.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే?-ipl 2025 mi vs dc surya kumar yadav fighting naman dhir knock helps mumbai indians to post descent total delhi capitals ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఆఖర్లో పిడుగులా.. వారెవా సూర్య.. ముంబయి బ్యాటర్ అద్భుత పోరాటం.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే?

ఆఖర్లో పిడుగులా.. వారెవా సూర్య.. ముంబయి బ్యాటర్ అద్భుత పోరాటం.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే?

ముంబయి ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్ తో మెరిశాడు. దాదాపు ఒంటిచేత్తో టీమ్ కు ఫైటింగ్ స్కోరు అందించాడు. ఆఖర్లో పట్టు వదలిని ఢిల్లీ పరుగులు ఇచ్చేసుకుంది.

సూర్యకుమార్ యాదవ్ (REUTERS)

సూర్య కుమార్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతంగా పోరాడాడు. అమేజింగ్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. బుధవారం (మే 21) ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో సత్తాచాటాడు. దీంతో వాంఖడేలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఈ టార్గెట్ ను ఢిల్లీ ఛేజ్ చేస్తేనే ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది.

రోహిత్ ఫెయిల్యూర్

వాంఖడే స్టేడియంలో స్టాండ్ కు తన పేరు పెట్టిన తర్వాత ఈ గ్రౌండ్ లో ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్ ఆడిన రోహిత్ ఫెయిలయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో అతను రాణించలేకపోయాడు. 5 బంతుల్లో 5 పరుగులే చేశాడు. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న ముస్తాఫిజుర్.. రోహిత్ ను ఔట్ చేశాడు. రోహిత్ ఔటైనా రికిల్టన్ (25), విల్ జాక్స్ (21) కలిసి స్కోరు బోర్డును నడిపించారు.

వరుస షాక్ లు

క్రమంగా జోరందుకుంటున్న ముంబయి ఇండియన్స్ కు వరుస షాక్ లు తగిలాయి. విల్ జాక్స్, రికిల్టన్ ను వరుస ఓవర్లలో ఔట్ చేసిన ఢిల్లీ పుంజుకుంది. విల్ జాక్స్ ను ముకేశ్ కుమార్, రికిల్టన్ ను కుల్ దీప్ యాదవ్ ఔట్ చేశాడు. ఈ వికెట్లతో ముంబయి ఇండియన్స్ జోరుకు బ్రేక్ పడింది. సూర్యకుమార్, తిలక్ వర్మ నిలబడ్డా స్పీడ్ గా ఆడలేకపోయారు.

స్లోగా స్కోరుబోర్డు

సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ షాట్లు ఆడటంలో ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా తిలక్ వర్మ బంతికో పరుగు మాత్రమే చేశాడు. 27 బంతుల్లో 27 పరుగులే చేశాడు. ఓ ఎండ్ లో సూర్యకుమార్ కొన్ని మెరుపు షాట్లు ఆడాడు. ముస్తాఫిజుర్, కుల్ దీప్ యాదవ్, విప్రజ్ నిగమ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

లాస్ట్ లో మెరుపులు

ఇన్నింగ్స్ లాస్ట్ లోనూ ముంబయి ఇండియన్స్ జోరు అందుకుంది. తిలక్ వర్మను ముకేశ్ కుమార్ ఔట్ చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య (3) నిలబడలేకపోయాడు. కానీ మరో ఎండ్ లో సూర్యకుమార్ పోరాటం కొనసాగించాడు. మంచి టైమింగ్ తో షాట్లు కొట్టాడు. ఒంటరిగానే ఫైటింగ్ కొనసాగించాడు.

27 రన్స్

సూర్యకుమార్ కు నమన్ ధీర్ జత కలవడంతో ముంబయి దూకుడు ప్రదర్శించింది. 18 ఓవర్లకు 132/5తో నిలిచిన ముంబయి 19వ ఓవర్లో 27 పరుగులు రాబట్టింది. ముకేశ్ కుమార్ వేసిన ఆ ఓవర్లో సూర్య, నమన్ ధీర్ కలిసి చెలరేగారు. ఆ ఓవర్ ఫస్ట్ బాల్ కు సిక్సర్ తో సూర్యకుమార్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఆ తర్వాత నమన్ ధీర్ వరుసగా 4, 6, 6, 4 బాదాడు.

చమీర వేసిన ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్లోనూ సూర్య విధ్వంసం చూపించాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో టీమ్ కు అనూహ్య స్కోరు అందించాడు. సూర్య, నమన్ దంచుడుతో లాస్ట్ 2 ఓవర్లలో కలిపి 48 పరుగులు సాధించింది ముంబయి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం