ఐపీఎల్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ కు మళ్లీ షాక్. హోం గ్రౌండ్ లో థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఆ టీమ్ విజయానికి ఒక బౌండరీ దూరంలో ఆగిపోయింది. మంగళవారం (ఏప్రిల్ 8) లక్నో సూపర్ జెయింట్స్ 4 రన్స్ తేడాతో కేకేఆర్ ను ఓడించింది. ఛేజింగ్ లో కేకేఆర్ 234/7 స్కోరు చేసింది. ఆకాశ్ దీప్, శార్దూల్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులు చేసింది. పూరన్ (36 బాల్స్ లో 87 నాటౌట్; 7 ఫోర్లు, 8 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (48 బాల్స్ లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) వీర విధ్వంసం చూపించారు.
అసలే 239 రన్స్ టార్గెట్. అద్భుత హిట్టింగ్ తో చెలరేగితే తప్ప గెలుపు దక్కదు. అందుకే ఐపీఎల్ 2025లో లక్నోతో ఛేజింగ్ లో కేకేఆర్ స్టార్టింగ్ నుంచే బాదుడుకు దిగింది. డికాక్ (15), నరైన్ (30) ఉన్నది కాసేపే అయినా దంచికొట్టారు. నాలుగో ఓవర్లోనే స్కోరు 50 దాటింది. రెండు వికెట్లు పడ్డా.. కెప్టెన్ రహానె విధ్వంసంతో కేకేఆర్ స్కోరు బోర్డు రాకెట్ వేగంతో సాగిపోయింది.
పవర్ ప్లేలో కేకేఆర్ 90/1 స్కోర్ చేసింది. ఐపీఎల్ లో ఆ టీమ్ కు ఇది రెండో అత్యధిక పవర్ ప్లే స్కోరు. రహానె, వెంకటేశ్ అయ్యర్ కలిసి లక్నో బౌలర్లను చిత్తుచిత్తుగా కొట్టారు. 12 ఓవర్లకు 149/2తో కేకేఆర్ గెలిచేలా కనిపించింది.
8 ఓవర్లలో 90 పరుగులు.. జోరుమీదున్న కేకేఆర్ కు ఈ సమీకరణం పెద్ద కష్టమేమీ కాదనిపించింది. కానీ వరుసగా 5 ఓవర్లు వేసిన శార్దూల్.. ఎట్టకేలకు రహానేను ఔట్ చేయడమే మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్. ఈ ఓవర్లు శార్దూల్ 11 బాల్స్ వేశాడు. ఐపీఎల్ లో లాంగెస్ట్ ఓవర్ రికార్డును ఇది సమం చేసింది. 35 బాల్స్ లో 61 రన్స్ చేసిన రహానె.. 8 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు.
రహానె వికెట్ తర్వాత కేకేఆర్ వరుసగా ఒక్కో ఓవర్లో ఒక్కో వికెట్ పోగొట్టుకుంది. రమణ్ దీప్, రఘువన్శీ, వెంకటేశ్, రసెల్ ఔటైపోయారు. వెంకటేశ్ అయ్యర్ 29 బాల్స్ లో 45 రన్స్ కొట్టాడు. ఇందులో 6 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. 162/2 నుంచి 185/7కు చేరుకున్న కేకేఆర్ గెలుపు దూరం చేసుకుంది.
లాస్ట్ 3 ఓవర్లలో విజయానికి కేకేఆర్ 45 పరుగులు చేయాల్సి వచ్చింది. క్రీజులో ఉన్న రింకుపైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.18వ ఓవర్ వేసిన స్పిన్నర్ దిగ్వేశ్ 7 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అవేశ్ వేసిన 19వ ఓవర్లో ఫస్ట్ రెండు బాల్స్ కు రింకు 6, 4 కొట్టి మరింత ఉత్కంఠ రేపాడు. కానీ ఆ తర్వాతి మూడు బంతుల్లో అవేశ్ ఒక్క పరుగూ ఇవ్వలేదు. లాస్ట్ బాల్ కు మరో ఫోర్ కొట్టాడు.
కేకేఆర్ గెలవాలంటే లాస్ట్ ఓవర్లో 24 రన్స్ చేయాల్సిన పరిస్థితి. స్పిన్నర్ రవి బిష్ణోయ్ బౌలింగ్.. కానీ స్ట్రైక్ లో ఉన్న హర్షిత్ ఓ ఫోర్, డాట్ చేసి మూడో బాల్ కు సింగిల్ తీశాడు. రింకు సింగ్ వరుసగా 4, 4, 6 కొట్టినా లాభం లేకపోయింది.
ఫస్ట్ లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు చేసింది. ముఖ్యంగా ఓపెనర్ మిచెల్ మార్ష్, నికొలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మొదట మార్ష్ 48 బంతుల్లోనే 81 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 5 సిక్స్ లు ఉన్నాయి. మరో ఓపెనర్ మార్‌క్రమ్ తో కలిసి తొలి వికెట్ కు మార్ష్ 10.2 ఓవర్లలోనే 99 రన్స్ జోడించాడు. మార్‌క్రమ్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 47 రన్స్ చేశాడు.
ఇక మూడో స్థానంలో వచ్చిన నికొలస్ పూరన్ మరింత చెలరేగాడు. అతడు కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. మొత్తంగా కేవలం 36 బంతుల్లోనే 8 సిక్స్ లు, 7 ఫోర్లతో 87 రన్స్ చేశాడు. మార్ష్ తో కలిసి రెండో వికెట్ కు అతడు 71 రన్స్ జోడించాడు. ఈ ముగ్గురూ చెలరేగడంతో లక్నో టీమ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 రన్స్ చేసింది.
సంబంధిత కథనం