ఐపీఎల్ 18కు బంపర్ హిట్ ఓపెనింగ్ దక్కింది. గత సీజన్ల రికార్డులన్నింటినీ ఈ సీజన్ బద్దలుకొట్టింది. వ్యూయర్‌షిప్‌లో హిస్టరీ క్రియేట్ చేసింది. టాటా ఐపీఎల్ 2025 ఫస్ట్ వీకెండ్ లో 137 కోట్ల వ్యూస్ ను రాబట్టింది. టీవీ వ్యూయర్‌షిప్ సగటును 39% పెరిగింది. మొదటి మూడు మ్యాచ్ లకు 25.3 కోట్ల వ్యూస్ దక్కాయి. ఐపీఎల్ లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్.
ఐపీఎల్ 18వ ఎడిషన్ కు జియోహాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెటవర్క్ కు అపూర్వ వ్యూయర్‌షిప్ లభించింది. టీవీ, డిజిటల్ లో కలిపి 4,956 కోట్ల నిమిషాల వాచ్ టైమ్ కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. జియోహాట్‌స్టార్‌లో మొదటి 3 మ్యాచ్ ల డిజిటల్ వ్యూయర్‌షిప్ గత సీజన్ కంటే 40% ఎక్కువ.
సీటీవీ (నెట్ తో కనెక్ట్ అయిన టీవీ) వినియోగంలో 54% పెరుగుదల కనిపించింది. ఐపీఎల్ 2025 మొదటి 3 మ్యాచ్ లకు 137 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఓ టైమ్ లో గరిష్ఠంగా 3.4 కోట్ల వ్యూస్ దక్కాయి.
బార్క్ డేటా ప్రకారం టీవీ వ్యూయర్‌షిప్ లోనూ ఐపీఎల్ 18వ సీజన్ కొత్త రికార్డు నెలకొల్పింది. ఓపెనింగ్ వీకెండ్ లో టీవీల్లో 25.3 కోట్ల వ్యూయర్స్ చూశారు. వాచ్ టైం ఏమో 2,770 కోట్ల నిమిషాలు. గతేడాది కంటే ఇది 22 శాతం ఎక్కువ. అలాగే ఫస్ట్ మూడు మ్యాచ్ ల సగటు చూస్తే అది గత సీజన్ కంటే 39 శాతం ఎక్కువ.
‘‘టాటా ఐపీఎల్ 2025 ప్రారంభ వారాంతంలో డిజిటల్ మరియు టీవీ ప్లాట్ ఫామ్ లో రికార్డ్ స్థాయి వ్యూయర్‌షిప్ విస్తృత పరిధి, లోతైన అభిమానుల కనెక్షన్లను సృష్టించే మా నిబద్ధతతో టోర్నమెంట్ సాటిలేని ప్రజాదరణను పునరుద్ఘాటిస్తుంది. 4,956 కోట్ల వ్యూ టైమ్ తో ఈ సీజన్ అసాధారణంగా ప్రారంభమైంది’’ అని జియోస్టార్ స్పోర్ట్స్ సీఈఓ సంజోగ్ గుప్తా తెలిపారు.
మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ తో ఐపీఎల్ 2025 స్టార్ట్ అయింది. ఆ మ్యాచ్ లో సొంతగడ్డపై కేకేఆర్ కు ఆర్సీబీ షాకిచ్చింది. ఆ తర్వాత ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ 286 పరుగులతో రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ లో ఇది రెండో టీమ్ హైయ్యస్ట్ స్కోరు.
సంబంధిత కథనం