ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ హీట్ మరింత పెంచేసింది. స్పెషల్ వీడియో క్రియేట్ చేయడమే కాకుండా సన్ రైజర్స్ కు వార్నింగ్ ఇచ్చింది. రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ రీక్రియేట్ చేయడం విశేషం. దీనిపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రియాక్టయ్యారు.
ఐపీఎల్ 18లో సోమవారం (మే 5) సన్ రైజర్స్ తో మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఆ టీమ్ రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ఫస్ట్ షాట్ గ్లింప్స్ ను రీక్రియేట్ చేసింది. హుస్సేన్ సాగర్, చార్మినార్ లాంటి హిస్టారికల్ ప్లేస్ లు చూపిస్తూ ఈ వీడియో స్టార్ట్ అయింది. బ్యాక్ గ్రౌండ్ లో హిందీలో రామ్ చరణ్ వాయిస్ వినిపిస్తుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు స్టేడియంలో అడుగుపెట్టారు.
పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్ బ్యాక్ గ్రౌండ్ కు తగ్గట్లుగా బౌలింగ్, బ్యాటింగ్ చేశారు. ఇక ఆ గ్లింప్స్ లో రామ్ చరణ్ కొట్టిన ఐకానిక్ క్రికెట్ షాట్ ను కూడా ఢిల్లీ రీక్రియేట్ చేసింది. ఆ గ్లింప్స్ లో రామ్ చరణ్ క్రీజు ముందుకు వచ్చి బ్యాట్ ను నేలపై బలంగా కొట్టి, ఆ తర్వాత బంతిని బాదుతారు. అచ్చం అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు సమీర్ రిజ్వీ షాట్ కొట్టడం వీడియోలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో ఢిల్లీ క్యాపిటల్స్ పోస్టు చేసిన ఈ వీడియోపై రామ్ చరణ్ రియాక్టయ్యారు. ‘‘ పెద్ది ఫస్ట్ షాట్ ను అద్భుతంగా రీక్రియేట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ధన్యవాదాలు. ఈ రోజు మ్యాచ్ కు మీకు ఆల్ ది బెస్ట్. సన్ రైజర్స్ బలంగా కమ్ బ్యాక్ ఇవ్వొచ్చు. అందుకు ప్రిపేర్డ్ గా ఉండండి’’ అని రామ్ చరణ్ ఈ వీడియోను పోస్టు చేశారు.
రామ్ చరణ్ పోస్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ రిప్లే ఇచ్చింది. ‘‘మీకంటే బాగా ఎవరూ చేయలేరు. పెద్దికి ఆల్ ది బెస్ట్. ఒకటే పని చేయడం కోసం వచ్చాం. ప్రిపేర్డ్ గానే ఉన్నాం’’ అని డీసీ పోస్టు చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. పెద్ది ట్రెండ్ ను డీసీ బాగానే వాడుకుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఆడే సన్ రైజర్స్ కు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు.
బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రెడీ అవుతోంది. ఈ మూవీలో రామ్ చరణ్ మాస్ లుక్ కేకలు పెట్టిస్తోంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ ఉమ్మడిగా ఈ మూవీ నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ చ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం