అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం (ఏప్రిల్ 13) జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. ఛేజింగ్ లో 19వ ఓవర్లు మూడు రనౌట్లతో ముంబయి ఆలౌటైంది. దీంతో ఢిల్లీకి హోం గ్రౌండ్ లో షాక్ తప్పలేదు. ఈ సీజన్ లో ఆ టీమ్ కు ఇదే ఫస్ట్ ఓటమి. అయితే మరోవైపు ఈ స్టేడియంలోని గ్రౌండ్ లో ఘర్షణ నెలకొంది. గొడవలో భాగంగా ఓ వ్యక్తిపై లేడీ ఫ్యాన్ దాడి చేయడం వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2025లో డీసీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ సందర్భంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లి స్టేడియంలోని స్టాండ్స్ లో తీవ్ర గొడవ జరిగింది. రెండు ఫ్యామిలీల మధ్య ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవలో భాగంగా ముఖ్యంగా ఓ అమ్మాయి.. అబ్బాయిను కొడుతున్నట్లు కనిపించింది. ఆ వెంటనే సెక్యూరిటీ వచ్చి గొడవకు ముగింపు పలికారు. అయితే ఈ గొడవ దారితీసిన కారణాలు తెలియరాలేదు. కానీ దీనికి సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ లో లాస్ట్ లో డ్రామా నెలకొంది. 206 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ.. కరుణ్ నాయర్ (89) విధ్వంసంతో ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ ఆఖర్లో అనూహ్యంగా తడబడింది. 12వ ఓవర్లో కరుణ్ వికెట్ తో కథ అడ్డం తిరిగింది. ముంబయి స్పిన్నర్లు కర్ణ్ శర్మ, శాంట్నర్ మ్యాచ్ ను మలుపు తిప్పారు.
ఇక బుమ్రా వేసిన 19వ ఓవర్లో వరుసగా ముగ్గురు ఢిల్లీ క్రికెటర్లు రనౌటయ్యారు. దీంతో టీమ్ 193 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 33 బంతుల్లో 59 పరుగులతో అదరగొట్టాడు.
2022 తర్వాత కరుణ్ నాయర్ తిరిగి ఈ సీజన్ లోనే ఐపీఎల్ లో అడుగుపెట్టాడు. మెగా వేలంలో రూ.50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ అతణ్ని కొనుగోలు చేసింది. ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దిగి సత్తాచాటాడు. ఏడేళ్ల తర్వాత ఐపీఎల్ ఫిఫ్టీ సాధించాడు.
2024 విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ 124 స్ట్రైక్ రేట్ తో, ఐదు సెంచరీలతో 779 పరుగులు సాధించాడు. టాప్ స్కోరర్ గా నిలిచాడు. రంజీ ట్రోఫీలో కూడా అతను ఆధిపత్యం ప్రదర్శించాడు. ఛాంపియన్ విదర్భ తరఫున 53.94 సగటుతో 863 పరుగులు నమోదు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఆరు ఇన్నింగ్స్ ల్లో 177.08 స్ట్రైక్ రేట్ తో 255 పరుగులు చేశాడు.
సంబంధిత కథనం