ఐపీఎల్ 2025లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. లక్నోలోని ఏకనా స్టేడియంలో సోమవారం (ఏప్రిల్ 14) చెన్నై సూపర్ కింగ్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతోంది. ఆడిన ఆరు మ్యాచ్ ల్లో వరుసగా అయిదు ఓడిన సీఎస్కే.. పాయింట్ల టేబుల్ లో లాస్ట్ ప్లేస్ లో ఉంది. మరోవైపు హ్యాట్రిక్ విజయాలు సహా 6 మ్యాచ్ ల్లో నాలుగు విక్టరీలతో లక్నో నాలుగో ప్లేస్ లో ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది.
అయిదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2025లో మాత్రం పేలవ ప్రదర్శన చేస్తోంది. ఫస్ట్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై గెలిచిన ఆ టీమ్.. ఆ తర్వాత వరుసగా అయిదు ఓటములు ఖాతాలో వేసుకుంది. ఓ ఐపీఎల్ సీజన్ లో సీఎస్కే వరుసగా అయిదు మ్యాచ్ ల్లో ఓడటం ఇదే ఫస్ట్ టైమ్. లక్నోతో మ్యాచ్ కోసం సీఎస్కే మార్పులు చేసింది. గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ డెబ్యూ చేయబోతున్నాడు.
ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే సీఎస్కే తిరిగి గెలుపు బాట పట్టాల్సిందే. లేదంటే మరింత అవమానంతో సీజన్ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గాయంతో సీజన్ కు దూరమవడంతో లెజెండ్ ధోని తిరిగి టీమ్ పగ్గాలు చేపట్టాడు. కానీ గత మ్యాచ్ లో కేకేఆర్ చేతిలో సీఎస్కే చిత్తుచిత్తుగా ఓడింది.
ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ ఫుల్ జోష్ మీద ఉంది. ఆ టీమ్ ఆరు మ్యాచ్ ల్లో నాలుగు గెలిచింది. ముఖ్యంగా గత మూడు మ్యాచ్ ల్లో వరుసగా విజయాలు సాధించింది. నికోలస్ పూరన్ రెచ్చిపోతున్నాడు.
6 ఇన్నింగ్స్ ల్లో 349 రన్స్ చేసిన పూరన్ టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. బౌలింగ్ లో శార్దూల్ ఠాకూర్ నిలకడగా రాణిస్తున్నాడు. 6 ఇన్నింగ్స్ ల్లో 11 వికెట్లు సాధించాడు. ఆ టీమ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో విజయాల వేటలో దూసుకెళ్తోంది. గాయంతో గత మ్యాచ్ కు దూరమైన డేంజరస్ బ్యాటర్ మిచెల్ మార్ష్ తిరిగొచ్చాడు.
సంబంధిత కథనం