IPL Dhoni Player Of The Match: ఆరేళ్ల తర్వాత అవార్డు.. నాకెందుకు అంటూ సీఎస్కే కెప్టెన్ ధోని ఇంట్రెస్టింగ్ కామెంట్లు
IPL Dhoni Player Of The Match: లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో సీఎస్కే కెప్టెన్ ధోని చెలరేగాడు. 11 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్ బాది జట్టును గెలిపించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కానీ ఆ అవార్డు తీసుకున్నాక ధోని చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) పరాజయ పరంపరకు బ్రేక్ పడింది. వరుసగా అయిదు ఓటముల తర్వాత ఓ టీమ్ విజయాన్ని సాధించింది. సోమవారం (ఏప్రిల్ 14) లక్నో సూపర్ జెయింట్స్ పై అయిదు వికెట్ల తేడాతో గెలిచింది. సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. సీఎస్కే కెప్టెన్ ధోని 11 బంతుల్లో అజేయంగా 26 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
ఇంకా ఆప్షన్లు
లక్నో పై మెరుపు ఇన్నింగ్స్ తో టీమ్ ను గెలిపించిన ధోని ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ లో మళ్లీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. టీమిండియా మాజీ కెప్టెన్ చివరిసారిగా 2019లో ఈ అవార్డును అందుకున్నాడు. ఇప్పుడు అవార్డు ఇవ్వడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనతో పోలిస్తే ఇంకా చాలా ఆప్షన్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును పొందేవని మ్యాచ్ అనంతరం ధోని నిర్మొహమాటంగా అంగీకరించాడు.
ఆరో వికెట్ కు 57 పరుగులతో అజేయంగా నిలిచిన ధోని చివరి ఓవర్లో సీఎస్కేను విజయతీరాలకు చేర్చాడు. శివమ్ దూబే 37 బంతుల్లో 43 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అర్థం కాలేదు
"ఈ రోజు నాకు అవార్డు ఎందుకు ఇస్తున్నారు? నూర్ అహ్మద్ బాగా బౌలింగ్ చేశాడని నేను భావిస్తున్నాను. కొత్త బంతి బౌలింగ్, మధ్యలో నూర్, జడ్డూ కలిసి నాలుగైదు ఓవర్లు.. ఇలా ఆ రెండు స్టేజీల్లో మేం మెరుగ్గా బౌలింగ్ చేశాం’’ అని మ్యాచ్ అనంతరం ధోనీ చెప్పుకొచ్చాడు.
లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ కోసం సీఎస్కే తన ప్లేయింగ్ ఎలెవన్ లో రెండు మార్పులు చేసింది. డెవాన్ కాన్వే, రవిచంద్రన్ అశ్విన్ లకు బదులుగా జేమీ ఓవర్టన్, షేక్ రషీద్ లను జట్టులోకి తీసుకుంది.
అశ్విన్ ను తప్పించాలన్న నిర్ణయాన్ని ధోనీ వివరిస్తూ.. ‘‘నిజానికి యష్ పై మేం చాలా ఒత్తిడి తెచ్చాం. పెద్దగా రాణించలేని వికెట్లపై రెండు ఓవర్లు వేయాల్సి రావడంతో బ్యాట్స్ మెన్ ఆధిపత్యం ప్రదర్శించారు. అందుకే కొన్ని మార్పులు చేశాం’’ అని ధోని చెప్పాడు.
సంతోషంగా ఉంది
ఐపీఎల్ 18వ ఎడిషన్ లో సీఎస్కే ఓటమి పరంపరకు ముగింపు పలకడంపై ధోని సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో వికెట్ కీపర్ గా 200 డిస్మిసల్స్ సాధించిన తొలి ఆటగాడిగా ధోని నిలిచాడు.
‘‘ఇలాంటి టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు మ్యాచ్ లు గెలవాలని కోరుకుంటారు. దురదృష్టవశాత్తూ మ్యాచ్ లు కొన్ని మనకు దక్కలేదు. ఏదైనప్పటికీ, చాలా కారణాలు ఉండవచ్చు. కాబట్టి విజయం సాధించడం మంచిది. ఇది టీమ్ మొత్తానికి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. కొన్ని విషయాల్లో మెరుగుపడటానికి ఇది మాకు సహాయపడుతుంది’’ అని ధోని పేర్కొన్నాడు.
సంబంధిత కథనం