IPL 2025 Virat Kohli: ధోని అడ్డాలో కోహ్లి సర్ ప్రైజ్.. అతను చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా.. ఏం జరిగిందంటే?
IPL 2025 Virat Kohli: చెపాక్ స్టేడియంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశాడు. అతను చేసిన పనికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ధోని కోసం చెపాక్ స్టేడియానికి ఫ్యాన్స్ పోటెత్తుతారు. సీఎస్కే ఎక్కడ మ్యాచ్ ఆడినా స్టేడియం ఎల్లో జెర్సీలతో నిండిపోవడం ఖాయమే. ఇక చెపాక్ టీమ్ ప్రాక్టీస్ సెషన్స్ కు కూడా ఫ్యాన్స్ పెద్ద మొత్తంలో అటెండ్ అవుతారు. అలాంటి స్టేడియంలో ధోని కాకుండా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఫ్యాన్స్ ను సంతోషంలో ముంచెత్తాడు. చెపాక్ లో తన కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఆటోగ్రాఫ్ లో ఇచ్చాడు. సెల్ఫీలు దిగాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.
మెగా పోరు
ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం (మార్చి 28) సీఎస్కే, ఆర్సీబీ మధ్య మెగా పోరు జరగబోతోంది. చెన్నైలోని చెపాక్ ఈ మ్యాచ్ కు వేదిక. ఈ పోరు కోసం ఆర్సీబీ ఇప్పటికే చెన్నై చేరుకుంది. అక్కడి చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సందర్భంగా స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ ను కోహ్లి సర్ ప్రైజ్ చేశాడు. ఫ్యాన్స్ కు ఆటోగ్రాఫ్ లు ఇచ్చాడు. వాళ్లతో సెల్ఫీలు దిగాడు. విరాట్ చేసిన ఈ పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది.
సీఎస్కే ఫ్యాన్స్
చెపాక్ లో సీఎస్కే ఫ్యాన్స్ కూడా విరాట్ తో ఆటోగ్రాఫ్ లు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఫ్రాంఛైజీలతో సంబంధం లేకుండా భారత లెజెండ్ క్రికెటర్ గా కోహ్లి సంపాదించుకున్న క్రేజ్ అలాంటిది మరి. కోహ్లిని కనీసం దగ్గరి నుంచి చూసేందుకు ఫ్యాన్స్ తెగ ట్రై చేస్తుంటారు. చెపాక్ లో సీఎస్కే జెర్సీ, ఇండియన్ టీమ్ జెర్సీ వేసుకున్న ఫ్యాన్స్.. విరాట్ ఆటోగ్రాఫ్ కోసం ప్రయత్నించడం వీడియోలో కనిపించింది.
చిన్నారుల్లో ఆనందం
ముఖ్యంగా చిన్నారి ఫ్యాన్స్ ముఖాల్లో విరాట్ కోహ్లి ఆనందం తెచ్చాడు. అక్కడున్న పిల్లలతో కోహ్లి సెల్ఫీలు తీసుకున్నాడు. ఎంతో ఓపికగా ఆటోగ్రాఫ్ లు ఇచ్చాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. సహజంగానే దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు తాము మద్దతిస్తున్న ఫ్రాంచైజీ కి వ్యతిరేకంగా ఆర్సీబీకి ఆడినా కోహ్లి బ్యాటింగ్ చూసి థ్రిల్ అవుతారు.
టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత కోహ్లీకి ఇదే తొలి ఐపీఎల్. ఈ సీజన్ ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి మ్యాచ్ లో విరాట్ అజేయ హాఫ్ సెంచరీతో ఆర్సీబీని గెలిపించాడు. 36 బంతుల్లో అజేయంగా 59 పరుగులు చేశాడు. మొదట ఒక దశలో 220కి పైగా స్కోర్ చేయగలిగేలా కనిపించిన కేకేఆర్ చివరకు 174/8 స్కోరుకే పరిమితమైంది. 31 బంతుల్లో 56 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్ తో కలిసి కోహ్లీ 95 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పి కేకేఆర్ ను విజయతీరాలకు చేర్చాడు.
సంబంధిత కథనం