CSK Record: సీఎస్కేనా మజాకా.. ఫ్యాన్ బేస్ మామూలుగా లేదు..హిస్టరీ క్రియేట్ చేసిన ధోని టీమ్..ఫస్ట్ ఐపీఎల్ జట్టుగా రికార్డు
CSK Record: ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ హిస్టరీ క్రియేట్ చేసింది. తిరుగులేని ఫ్యాన్ బేస్ తో రికార్డు నమోదు చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో అరుదైన ఫీట్ సొంతం చేసుకుంది. ఐపీఎల్ ఫస్ట్ టీమ్ గా నిలిచింది.

ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు ఉండే ఫ్యాన్ బేస్ గురించి అందరికీ తెలిసిందే. ఆ జట్టు మ్యాచ్ ఉందంటే స్టేడియంలో మొత్తం ఎల్లో మయం అవుతుంది. చెన్నైలోనే కాదు దేశంలో ఇతర ఏ స్టేడియంలో మ్యాచ్ జరిగినా ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ జట్టు కు డైహార్డ్ ఫ్యాన్స్ ఎక్కువ. ఇక సోషల్ మీడియాలోనూ సీఎస్కే ఫ్యాన్ బలం ఎక్కువే. తాజాగా ఆ జట్టు ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ పరంగా కొత్త రికార్డు నెలకొల్పింది.
ఫస్ట్ టీమ్
చెన్నై సూపర్ కింగ్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్ 2025 ఆరంభానికి ముందే హిస్టరీ క్రియేట్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో ఆ టీమ్ ఫాలోవర్స్ సంఖ్య 17 మిలియన్లు దాటింది. 17 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించిన ఫస్ట్ ఐపీఎల్ టీమ్ గా సీఎస్కే నిలిచింది. మిగతా ఫ్రాంఛైజీలన్నీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ లో సీఎస్కే వెనుకే ఉన్నాయి.
వీటిల్లో కూడా
ఇన్ స్టాగ్రామ్ మాత్రమే కాదు ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లోనూ సీఎస్కే ఫాలోవర్ల సంఖ్య చూస్తే దిమ్మతిరిగాల్సిందే. ఫేస్ బుక్ లో ఆ టీమ్ కు 14 మిలియన్ల ఫాలోవర్లున్నారు. ఎక్స్ (ట్విట్టర్)లో ఆ సంఖ్య 11 మిలియన్లుగా ఉంది. ఇక కొత్త సీజన్ స్టార్ట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఆ టీమ్ ఫ్యాన్స్ సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది.
ఆర్సీబీ సెకండ్ ప్లేస్
ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పరంగా చూస్తే సీఎస్కే తర్వాత ఆర్సీబీ రెండో స్థానంలో ఉంది. ఆ టీమ్ కు 16.4 మిలియన్ల ఫాలోవర్లున్నారు. ముంబయి ఇండియన్స్ కు 15.4 మిలియన్ల ఫాలోవర్లున్నారు. మిగతా ఏ ఫ్రాంఛైజీ కూడా ఫాలోవర్స్ లో 10 మిలియన్ దాటలేదు.
కేకేఆర్ కు 6.7 మిలియన్, రాజస్థాన్ రాయల్స్ కు 4.5 మిలియన్, సన్ రైజర్స్ హైదరాబాద్ కు 4.5 మిలియన్, గుజరాత్ టైటాన్స్ కు 4.2 మిలియన్, ఢిల్లీ క్యాపిటల్స్ కు 4.1 మిలియన్,పంజాబ్ కింగ్స్ కు 3.4 మిలియన్, లక్నో సూపర్ జెయింట్స్ కు 3.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
కిరాక్ ఫ్యాన్స్
ఏ జట్టుకైనా ఫ్యాన్స్ ఉండటం కామనే. కానీ సీఎస్కే ఫ్యాన్స్ మాత్రం వేరే లెవల్. తమ జట్టు కోసం ఏమైనా చేస్తారు. మ్యాచ్ లు చూసేందుకు ఎంత దూరమైనా వెళ్తారు. ఇక ధోని బ్యాటింగ్ చూడటం కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటారు. అందుకే చెన్నై తన రెండో ఇంటిగా మారిందని ధోని ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు. తలా అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ధోనీని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతుంటారు.
సంబంధిత కథనం