GT vs MI IPL 2024: గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో గెలిచేది ఆ జట్టే? డ్రీమ్ 11 ప్రిడిక్షన్, పిచ్ రిపోర్ట్ ఇదే!-ipl 2024 today match details who will win gujarat titans vs mumbai indians clash today match prediction pitch details ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gt Vs Mi Ipl 2024: గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో గెలిచేది ఆ జట్టే? డ్రీమ్ 11 ప్రిడిక్షన్, పిచ్ రిపోర్ట్ ఇదే!

GT vs MI IPL 2024: గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో గెలిచేది ఆ జట్టే? డ్రీమ్ 11 ప్రిడిక్షన్, పిచ్ రిపోర్ట్ ఇదే!

Sanjiv Kumar HT Telugu
Mar 24, 2024 11:56 AM IST

GT vs MI IPL 2024: నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఎంఐ 2024 టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ పోరులో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయో చూద్దాం.

గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో గెలిచేది ఆ జట్టే? డ్రీమ్ 11 ప్రిడిక్షన్, పిచ్ రిపోర్ట్ ఇదే!
గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో గెలిచేది ఆ జట్టే? డ్రీమ్ 11 ప్రిడిక్షన్, పిచ్ రిపోర్ట్ ఇదే!

GT vs MI IPL 2024: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు చివరిసారిగా గత సీజన్‌లో క్వాలిఫయర్స్‌లో తలపడగా, ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఊహించని విధంగా చిత్తుగా ఓడింది.

గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. గత ఏడాది 50 ఓవర్ల ప్రపంచకప్‌లో కాలి మడమ గాయం తర్వాత తొలిసారి పోటీలోకి దిగాడు పాండ్యా. అయితే జూన్‌లో జరిగే 2024 టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న హార్ధిక్ పాండ్యా ఈ ఐపీఎల్ సీజన్‌లో తన ఆట తీరుతో నిరూపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

ఇప్పటికే ప్లేయర్ల గాయాలతో ముంబై ఇండియన్స్ సతమతం అవుతోంది. పైగా పేసర్లు జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, దిల్షాన్ మధుశంక టోర్నీకి దూరమయ్యారు. అలాగే స్టార్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఇంకా ఎన్సీఏ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ రాలేదు. ఇదే కాకుండా గజ్జ గాయం కారణంగా టోర్నీ ప్రారంభ దశలోనే ఆల్ రౌండర్ గెరాల్డ్ కోట్జీని కూడా ఎంఐ కోల్పోయే అవకాశం ఉంది. ఇలా ముంబై ఇండియన్స్ ప్రస్తుతం చిక్కులో ఉందనే చెప్పుకోవచ్చు.

కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి రెండు ఐపీఎల్ సీజన్లలో చూపించిన నిలకడను గుజరాత్ టైటాన్స్ కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అతని బ్యాటింగ్ నైపుణ్యం పక్కన పెడితే, గత ఏడాది అత్యధిక పరుగులు చేసిన గిల్ కెప్టెన్సీతో వచ్చే అదనపు ఒత్తిడి ప్రభావం తన బ్యాటింగ్‌పై పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది.

జీటీ వర్సెస్ ఎంఐ పిచ్ రిపోర్ట్:

నరేంద్ర మోదీ స్టేడియంలో మొత్తం 11 పిచ్‌లు ఉన్నాయి. వీటిలో 5 బ్లాక్ సాయిల్ కాగా మరో 5 రెడ్ సాయిల్ నేలలు. బ్లాక్ డస్ట్ పిచ్‌లు బాల్ బౌన్స్ అయ్యేలా చేస్తాయి. వాటి ద్వారా పరుగులు సాధించడం చాలా సులభం. ఇక రెడ్ సాయిల్ పిచ్‌లు త్వరగా డ్రై అవుతాయి. కాబట్టి, పొడిగా ఉన్న ఈ పిచ్‌ స్పిన్నర్లకు ఉపయోగపడే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, ఐపీఎల్ సమయంలో నరేంద్ర మోదీ స్టేడియం మొదటి ఇన్నింగ్స్‌లో సగటున 170 పరుగులకు పైగా స్కోరు చేసే పిచ్‌గా పేరుంది. ఒక జట్టు మొదట బ్యాటింగ్ చేయడం లేదా ఛేజింగ్ చేసే అవకాశాలు దాదాపు సమానంగా ఉంటాయి. కాబట్టి టాస్ పెద్దగా కీలకంగా మారే అవకాశం లేనట్లు కనిపిస్తోంది.

జీటీ వర్సెస్ ఎంఐ డ్రీమ్ 11 అంచనా:

బ్యాట్స్ మెన్స్ - రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, టిమ్ డేవిస్, డేవిడ్ మిల్లర్

వికెట్ కీపర్ - ఇషాన్ కిషన్

ఆల్ రౌండర్స్ - రషీద్ ఖాన్, హార్దిక్ పాండ్యా

బౌలర్లు - జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ మధ్వాల్, ఉమేశ్ యాదవ్

మ్యాచ్ ఎవరు గెలుస్తారు?

గూగుల్ మ్యాచ్ ప్రిడిక్టర్ ప్రకారం.. అహ్మదాబాద్‌లో నేడు (మార్చి 24) జరిగే కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశం 56% ఉంది. కాగా, ఈ రోజు అహ్మదాబాద్‌లో తొలుత బ్యాటింగ్ చేసే జట్టే విజయం సాధిస్తుందని క్రిక్ ట్రాకర్ తెలిపింది.

WhatsApp channel