IPL 2024 points table: ఐపీఎల్ పాయింట్ల టేబుల్.. చివరి స్థానాన్ని వదిలించుకున్న ముంబై.. సన్ రైజర్స్ కొంప ముంచింది-ipl 2024 points table mumbai indians moved to 9th after win over sunrisers hyderabad srh still in 4th ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Points Table: ఐపీఎల్ పాయింట్ల టేబుల్.. చివరి స్థానాన్ని వదిలించుకున్న ముంబై.. సన్ రైజర్స్ కొంప ముంచింది

IPL 2024 points table: ఐపీఎల్ పాయింట్ల టేబుల్.. చివరి స్థానాన్ని వదిలించుకున్న ముంబై.. సన్ రైజర్స్ కొంప ముంచింది

Hari Prasad S HT Telugu
May 07, 2024 07:38 AM IST

IPL 2024 points table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్ మరోసారి మారింది. ముంబై ఇండియన్స్ తన చివరి స్థానాన్ని వదిలించుకోగా.. సన్ రైజర్స్ పై విజయంతో ఆ టీమ్ కొంప ముంచింది.

ఐపీఎల్ పాయింట్ల టేబుల్.. చివరి స్థానాన్ని వదిలించుకున్న ముంబై.. సన్ రైజర్స్ కొంప ముంచింది
ఐపీఎల్ పాయింట్ల టేబుల్.. చివరి స్థానాన్ని వదిలించుకున్న ముంబై.. సన్ రైజర్స్ కొంప ముంచింది (AFP)

IPL 2024 points table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లోనూ ఊహించిందే జరుగుతోంది. కింద ఉన్న టీమ్స్ టాప్ 4లోని జట్ల ప్లేఆఫ్స్ ఆశలను దెబ్బ తీస్తున్నాయి. తాజాగా ఇప్పటికే ప్లేఆఫ్స్ ఆశలను దాదాపు వదిలేసుకున్న ముంబై ఇండియన్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ పై గెలిచి చివరి స్థానాన్ని వదిలించుకుంది. అయితే ఇది సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను ప్రభావితం చేసింది.

ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్

మొన్న ఆర్సీబీలాగే ఇప్పుడు ముంబై ఇండియన్స్ కూడా పాయింట్ల టేబుల్లో తన చివరి స్థానం నుంచి బయటపడింది. సన్ రైజర్స్ పై విజయంతో ఆ టీమ్ తొమ్మిదో స్థానానికి చేరుకుంది. ఇప్పటికీ ముంబై ప్లేఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యమే అయినా.. ఆ టీమ్ వల్ల ఇతర జట్ల అవకాశాలు దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది. సన్ రైజర్స్ విషయంలోనూ అదే జరిగింది.

ఈ సీజన్ మొదట్లో హైదరాబాద్ లో ఇదే ముంబై ఇండియన్స్ పై 277 పరుగులతో చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్.. ఈసారి చేతులెత్తేసింది. ఈ ఓటమి తర్వాత హైదరాబాద్ నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది. అయితే ప్లేఆఫ్స్ బెర్తుకు మరికాస్త దూరమైంది. ఈ 55వ మ్యాచ్ తర్వాత ముంబై 12 మ్యాచ్ లలో 4 విజయాలతో 12 పాయింట్లు సాధించి 9వ స్థానంలో ఉంది.

ఇక సన్ రైజర్స్ 11 మ్యాచ్ లలో 6 విజయాలు, 5 ఓటములతో 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అయితే ఎస్ఆర్‌హెచ్ నెట్ రన్ రేట్ నెగటివ్ (-0.065)లోకి వెళ్లిపోవడం ఆందోళన కలిగించేదే. ముఖ్యంగా లక్నో, ఢిల్లీలాంటి టీమ్స్ వెంటే ఉండటంతో వాటి నుంచి సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ బెర్తుకు ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి.

మిగతా టీమ్స్ ఇలా

ముంబై ఇండియన్స్ 9వ స్థానానికి చేరడంతో మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ చివరి స్థానానికి పడిపోయింది. ఆ టీమ్ 11 మ్యాచ్ లలో 4 విజయాలు, 7 ఓటములతో ఉంది. నెట్ రన్ రేట్ విషయంలో ముంబై కంటే వెనుకబడటంతో 10వ స్థానానికి దిగజారింది. ముంబై, హైదరాబాద్ మ్యాచ్ తర్వాత టాప్ లో ఎలాంటి మార్పులు రాలేదు. కేకేఆర్ తొలి స్థానంలోనే కొనసాగుతోంది.

రెండు, మూడు స్థానాల్లో వరుసగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నాయి. ఇక ఐదు, ఆరు స్థానాల్లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగుతున్నాయి. ఏడు, ఎనిమిది స్థానాల్లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. టాప్ 6లో ఉన్న టీమ్స్ కు ఇప్పటికీ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. అయితే ఆ కింద ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్న జట్లు కూడా ఏదైనా అద్భుతం జరిగితే టాప్ 4లోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది.

లీగ్ స్టేజ్ లో మరో 15 మ్యాచ్ లు ఉన్నాయి. మంగళవారం (మే 7) రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే రాయల్స్ టీమ్ ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ డీసీ గెలిస్తే మాత్రం టాప్ 4లోకి వచ్చే అవకాశం ఉంటుంది.

ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్
ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్
IPL_Entry_Point