IPL 2024 SRH: బ్రూక్‍తో పాటు మరో ఐదుగురికి సన్‍రైజర్స్ హైదరాబాద్ గుడ్‍బై.. రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల లిస్ట్ ఇదే
IPL 2024 Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మొత్తంగా ఆరు మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‍కు కూడా గుడ్‍బై చెప్పింది. కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్‍ను కొనసాగించింది.
IPL 2024 Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్‍కు ముందు ఆరుగురు ఆటగాళ్లను సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజ్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ 2023లో హైదరాబాద్ టీమ్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‍ల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. దీంతో వచ్చే సీజన్ కోసం మార్పులను చేసేందుకు ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం మొగ్గుచూపింది.
కేన్ విలియమ్సన్ గుజరాత్ టీమ్‍కు వెళ్లిపోవడంతో 2023 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు కెప్టెన్సీ చేశాడు దక్షిణాఫ్రికా ప్లేయర్ ఐడెన్ మార్క్‌రమ్. అతడి సారథ్యంలోనూ ఎస్ఆర్‌హెచ్ రాణించలేకపోయింది. అయితే, ఐపీఎల్ 2024 సీజన్‍కు అతడిని రిటైన్ చేసుకున్న హైదరాబాద్.. కెప్టెన్‍గానూ కొనసాగించనుంది.
అయితే, రూ.13.25 కోట్లతో దక్కించుకున్న ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‍ను హైదరాబాద్ రిలీజ్ చేసింది. 2022 మినీ వేలంలో హైదరాబాద్ అతడిని కొనుగోలు చేసింది. అయితే, 2023 సీజన్‍లో అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో బ్రూక్‍ను హైదరాబాద్ రిలీజ్ చేసింది.
ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఈ ఏడాది డిసెంబర్ 19న మినీ వేలం జరగనుంది. ఇందుకోసం రిటైన్, రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను నేడు (నవంబర్ 26) సన్‍రైజర్స్ హైదరాబాద్ వెల్లడించింది. బ్రూక్, కార్తిక్ త్యాగి సహా మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లను హైదరాబాద్ జట్టు వదులుకుంది. మిగిలిన వారిని కొనసాగించింది. షెహబాజ్ అహ్మద్‍ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నుంచి ట్రేడ్ చేసి తీసుకుంది ఎస్ఆర్‌హెచ్. ఆరుగురు ఆటగాళ్లను రిలీజ్ చేసిన తర్వాత ఎస్‍ఆర్‌హెచ్ పర్సులో వేలం కోసం రూ.34 కోట్ల ఫండ్స్ ఉన్నాయి. హైదరాబాద్ రిలీజ్ చేసిన, రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితా ఇదే.
ఎస్ఆర్‌హెచ్ రిలీజ్ చేసిన 6 ఆటగాళ్లు
- హ్యారీ బ్రూక్
- కార్తీక్ త్యాగి
- సమర్థ్ వ్యాస్
- వివ్రాంత్ శర్మ
- అకీల్ హుసేన్
- ఆదిల్ రషీద్
ఎస్ఆర్‌హెచ్ కొనసాగించిన (రిటైన్) ఆటగాళ్లు విరే
- అబ్దుల్ సమద్
- ఐడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్)
- రాహుల్ త్రిపాఠి
- గ్లెన్ ఫిలిప్స్
- హెన్రిచ్ క్లాసెన్
- మయాంక్ అగర్వాల్
- అన్మోల్‍ప్రీత్ సింగ్
- ఉపేంద్ర సింగ్ యాదవ్
- నితీశ్ కుమార్ రెడ్డి
- షెహబాజ్ అహ్మద్ (ఆర్సీబీ నుంచి ట్రేడ్)
- అభిషేక్ శర్మ
- మార్కో జాన్సెన్
- వాషింగ్టన్ సుందర్
- సన్వీర్ సింగ్
- భువనేశ్వర్ కుమార్
- టి నటరాజన్
- మయాంక్ మార్కండే
- ఉమ్రాన్ మాలిక్
- ఫజల్‍హక్ ఫారుకీ