CSK vs RCB who will win: సీఎస్కే, ఆర్సీబీల్లో గెలిచేది ఎవరు? గత రికార్డులు ఎలా ఉన్నాయి? పిచ్ రిపోర్ట్ ఇదీ-ipl 2024 csk vs rcb who will win dhoni vs kohli rcb csk previous records chennai pitch report csk final xi rcb final xi ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Csk Vs Rcb Who Will Win: సీఎస్కే, ఆర్సీబీల్లో గెలిచేది ఎవరు? గత రికార్డులు ఎలా ఉన్నాయి? పిచ్ రిపోర్ట్ ఇదీ

CSK vs RCB who will win: సీఎస్కే, ఆర్సీబీల్లో గెలిచేది ఎవరు? గత రికార్డులు ఎలా ఉన్నాయి? పిచ్ రిపోర్ట్ ఇదీ

Hari Prasad S HT Telugu
Mar 21, 2024 07:25 PM IST

CSK vs RCB who will win: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్ లో తలపడబోతున్నాయి. వీటిలో గెలిచేది ఎవరు? గత రికార్డులు ఏం చెబుతున్నాయి? చెన్నైలోని చిదంబరం స్టేడియం పిచ్ ఎలా ఉందో ఇక్కడ చూడండి.

సీఎస్కే, ఆర్సీబీల్లో గెలిచేది ఎవరు? గత రికార్డులు ఎలా ఉన్నాయి? పిచ్ రిపోర్ట్ ఇదీ
సీఎస్కే, ఆర్సీబీల్లో గెలిచేది ఎవరు? గత రికార్డులు ఎలా ఉన్నాయి? పిచ్ రిపోర్ట్ ఇదీ

CSK vs RCB who will win: ఐపీఎల్ 2024 వచ్చేసింది. శుక్రవారం (మార్చి 22) డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ తో 17వ సీజన్ ప్రారంభం కానుంది. మరి సీఎస్కే, ఆర్సీబీల్లో గెలిచి బోణీ చేసేది ఎవరు? ఈ రెండు జట్ల గత రికార్డులు ఎలా ఉన్నాయి? పిచ్ ఎవరికి అనుకూలం? కొత్త కెప్టెన్ రుతురాజ్ సారథ్యంలో సీఎస్కే బోణీ చేస్తుందాలాంటి ఆసక్తికర విషయాలను చూడండి.

సీఎస్కే వెర్సెస్ ఆర్సీబీ

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను వాళ్ల సొంతగడ్డ అయిన చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆర్సీబీ ఢీకొంటోంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో దిగుతున్న సీఎస్కేను వాళ్ల సొంత మైదానంలో ఓడించడం ఆర్సీబీకి అంత సులువు కాదు. ఇటు ధోనీ, అటు కోహ్లి మధ్య వార్ ఎంతో ఆసక్తి రేపుతోంది. ఈ మ్యాచ్ శుక్రవారం (మార్చి 22) రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్ కు ముందు సీఎస్కే, ఆర్సీబీ మధ్య గత రికార్డులను పరిశీలిద్దాం. ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకూ 31 మ్యాచ్ లలో తలపడగా.. సీఎస్కే 21 మ్యాచ్ లలో గెలిచింది. ఆర్సీబీ 10 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఒక దాంట్లో ఫలితం తేలలేదు. ఈ లెక్కన ఆర్సీబీపై చెన్నై సూపర్ కింగ్స్ స్పష్టమైన ఆధిక్యం సాధించినట్లు స్పష్టమవుతోంది.

సీఎస్కే తుది జట్టు అంచనా

రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ధోనీ, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, ముకేశ్ చౌదరి, మహీష్ తీక్షణ

ఆర్సీబీ తుది జట్టు అంచనా

ఫాఫ్ డుప్లెస్సి, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, మయాంక్ డాగర్, విజయ్ కుమార్ వైశాఖ్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ

చెన్నై పిచ్ ఎలా ఉందంటే?

చెన్నైలోని చిదంబరం పిచ్ సాంప్రదాయంగా స్పిన్నర్లకు అనుకూలిస్తూ వస్తోంది. ఇది మరీ భారీ స్కోర్ల పిచ్ కూడా కాదు. లోబౌన్స్ కారణంగా పరుగులు తీయడం అంత సులువు కాదు. శుక్రవారం (మార్చి 22) చెన్నైలో వర్షం కురిసే అవకాశాలు కూడా లేవు. కాకపోతే ఎండ వేడిమి ప్లేయర్స్ కు పరీక్ష పెట్టనుంది. గాల్లో తేమ శాతం అధికంగా ఉండటం కూడా ఇబ్బందే.

సీఎస్కే, ఆర్సీబీల్లో గెలుపు ఎవరిది?

ప్రస్తుత ఫామ్, గత రికార్డులు, పిచ్ పరిగణనలోకి తీసుకుంటే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బౌలింగ్ పరంగా ఆర్సీబీ కాస్త బలహీనంగా ఉండటం కూడా దీనికి కారణంగా చెప్పొచ్చు. బ్యాటింగ్ విషయంలో మాత్రం ఆర్సీబీ చాలా పటిష్టంగా ఉంది. డుప్లెస్సి, కోహ్లి, మ్యాక్స్‌వెల్, గ్రీన్ లాంటి వాళ్లతో ఎలాంటి బౌలింగ్ కైనా సవాలే.

మరోవైపు సీఎస్కేలో ఆల్ రౌండర్లు మెండుగా ఉన్నారు. జడేజా, శార్దూల్, మిచెల్, రచిన్ లతో ఆ టీమ్ పటిష్టంగా ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Whats_app_banner