IPL 2024: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ కీలక నిర్ణయం.. సెక్యూరిటి కారణాలతో!-ipl 2024 bcci plans to held ipl second phase matches in uae ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ కీలక నిర్ణయం.. సెక్యూరిటి కారణాలతో!

IPL 2024: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ కీలక నిర్ణయం.. సెక్యూరిటి కారణాలతో!

Sanjiv Kumar HT Telugu
Mar 16, 2024 12:04 PM IST

IPL 2024 BCCI: ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ పెద్ద షాక్ ఇచ్చింది. ఐపీఎల్ 2024 షెడ్యూల్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ట్విస్ట్ ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.

 ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ కీలక నిర్ణయం
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ కీలక నిర్ణయం

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 షెడ్యూల్‌కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుని ఐపీఎల్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చినట్లు అయింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్‌లకు సంబంధించిన వేదికను మార్చనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 ద్వితీయార్థ మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఎన్నికల షెడ్యూల్ శనివారం (మార్చి 16) మధ్యాహ్నం విడుదల కానున్న నేపథ్యంలో ఐపీఎల్ 2024 సెకండాఫ్ మ్యాచ్‌లపై బీసీసీఐ సమాలోచనలు జరుపుతున్నట్లు టాక్. దేశంలో దశలవారీగా ఎన్నికలు జరగనుండటంతో సెకండాఫ్ మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఐపీఎల్ 2024 టోర్నీ వివరాలను బీసీసీఐ వెల్లడించనుంది.

కాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మొదట ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్‌లను సైతం భారత్‌లో నిర్వహించాలని బీసీసీఐ భావించింది. అయితే, ఎలక్షన్స్ లేని నగరాల్లో మ్యాచ్‌లు జరిపించాలని అనుకుంది. కానీ, సార్వత్రిక ఎన్నికలు పలు దశల్లో నిర్వహించాలని ఇండియన్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకోవడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి తన ప్లాన్స్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడమే మంచిదని బీసీసీఐ ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా అర్థం అవుతోంది.

ఎలక్షన్స్ సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు సెక్యూరిటీ ఇవ్వలేమని ఆయా రాష్ట్రాల పోలీస్ శాఖలు తెలియజేయడంతో ఇలా బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ఐపీఎల్ మ్యాచ్‌లను ఇండియాలో లైవ్‌గా చూడాలనుకున్న అభిమానులకు భారీ నిరాశే ఎదురైనట్లుగా చెప్పుకోవచ్చు. బీసీసీఐ ప్రకటించిన ఐపీఎల్ 2024 మొదటి షెడ్యూల్ ప్రకారం మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై వేదికగా ఫస్ట్ మ్యాచ్ ఆడనున్నాయి.

ఐపీఎల్ 2024 ఫస్టాఫ్ షెడ్యూల్‌సో మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. హోమ్ అండ్ అవే ఫార్మాట్‌లో వీటిని జరిపించనున్నారు. కాగా ఐపీఎల్ 17వ సీజన్‌ను పూర్తిగా భారత్‌లోనే నిర్వహించడం ఖాయమని లీగ్ చైర్మన్ అరుణఅ ధూమల్ గతంలో చెప్పారు. దానికి తగినట్లుగానే మొదట 15 రోజుల షెడ్యూల్ రిలీజ్ చేసి ఆ తర్వాత మిగతా మ్యాచ్‌ల తేదీలను ప్రకటిస్తామని తెలిపారు.

ఇప్పుడు మార్చి 16 శనివారం మధ్యాహ్నం 3 గంటలకు భారత ఎన్నికల సంఘం ఎలక్షన్స్ షెడ్యూల్ ప్రకటించనుంది. ఆ తర్వాత ఐపీఎల్ 2024 సెకండాఫ్ మ్యాచ్‌లు ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుని వెల్లడించనుంది. మ్యాచ్‌లకు దుబాయ్‌ను ఎంచుకోవాలా లేదా ఇక్కడే నిర్వహించాలా అనేది తేలుతుంది.

Whats_app_banner