సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి 12 ఏళ్లయింది. సచిన్ ను ఫ్యాన్స్ త్వరగానే మర్చిపోతారనే కామెంట్లు అప్పుడు వినిపించాయి. కానీ 51 ఏళ్ల వయసులోనూ ‘సచిన్.. సచిన్’ అనే కేకలతో స్టేడియాలు మార్మోగాయి. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో క్లాసిక్ బ్యాటింగ్ తో ఫ్యాన్స్ ను సచిన్ గతంలోకి తీసుకెళ్లాడు. సచిన్ బ్యాటింగ్ చూసి మెస్మరైజ్ అయిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు. సచిన్ తో బాబర్ ఆజంను పోలుస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు.
టీమిండియా తరపున 20 ఏళ్లకు పైగా తన అమేజింగ్ బ్యాటింగ్ తో ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించాడు సచిన్. ఇప్పుడు 51 ఏళ్ల ఏజ్ లోనూ సచిన్ బ్యాటింగ్ కు వస్తే స్టేడియాలో హోరెత్తాయి. సచిన్ సచిన్ కేకలతో మార్మోగాయి. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో ఇండియా మాస్టర్స్ కెప్టెన్ గా సచిన్ అదరగొట్టాడు. ప్రొఫెషనల్ క్రికెట్ కు హీరోలా తిరిగొచ్చిన సచిన్ ఫైనల్‌లో వెస్టిండీస్ మాస్టర్స్‌పై ఇండియా మాస్టర్స్‌కు విజయాన్ని అందించాడు.
ఈ టోర్నీ సాంతం ఫ్యాన్స్ ను సచిన్ గతంలోకి తీసుకెళ్లాడు. వరుసగా 34, 64, 42 మరియు 25 పరుగుల ఇన్నింగ్స్‌లతో అదరగొట్టాడు. 51 ఏళ్ల టెండూల్కర్ ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసినవారి జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 181 పరుగులు చేసిన అతను క్లాసిక్ షాట్లను ఆడాడు.
స్ట్రెయిట్ డ్రైవ్‌లు, పుల్ షాట్లు, అన్నింటిలోనూ అత్యంత గుర్తుండిపోయే అప్పర్ కట్.. ఇలా సచిన్ బ్యాటింగ్ తో మరోసారి మ్యాజిక్ చేశాడు. గత వారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టెండూల్కర్ చేసిన 64 పరుగుల ఇన్నింగ్స్ అతని అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటి. ఆస్ట్రేలియా బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా బౌలర్లపై అతను మరోసారి విరుచుకుపడ్డాడు. ఫైనల్లో వేగవంతమైన 25 పరుగులతో వెస్టిండీస్‌పై 149 పరుగుల లక్ష్యాన్ని ఇండియా ఛేదించడానికి సహాయపడ్డాడు.
సచిన్ ఎప్పటిలాగే ఫ్యాన్స్ ను స్టేడియాలకు రప్పించాడు. రాయ్‌పూర్‌లో జరిగిన ఫైనల్‌లో దాదాపు 50,000 మంది ప్రజలు అతను బ్యాటింగ్, ఫీల్డింగ్ లేదా కెప్టెన్సీ చేస్తున్నప్పుడు ఐకానిక్ 'సచిన్, సచిన్' అనే నినాదాలు చేశారు. అతను డగ్అవుట్‌లో కూర్చున్నా.. పెద్ద తెరపై సచిన్ కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకులు ఉద్వేగానికి గురయ్యారు. 12 సంవత్సరాల క్రితం రిటైరైన ఆటగాడు ఇప్పటికీ ఇలాంటి ఎమోషన్స్ కు కారణమవడం అరుదే. కేవలం సచిన్ కు మాత్రమే ఇది సాధ్యం.
మరోవైపు పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం ను కొంతమంది పాక్ ఫ్యాన్స్, మాజీలు గతంలో సచిన్ తో పోల్చారు. కానీ సచిన్ తో పోలిక కాదు కనీసం అతని క్రేజ్ కు దగ్గరకు కూడా బాబర్ రాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ ఆడినప్పుడు కాదు కదా ఇప్పటి బ్యాటర్ సచిన్ ను కూడా బాబర్ అందుకోలేడని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు.
సంబంధిత కథనం