Yuvi-Sachin IML: యువీ 7 సిక్సర్లు.. సచిన్ 7 ఫోర్లు.. ఒకప్పటిలా లెజెండ్స్ బ్యాటింగ్ విధ్వంసం.. వీడియోలు వైరల్-international masters league t20 2025 india masters vs australia masters sachin tendulkar yuvraj singh batting class ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Yuvi-sachin Iml: యువీ 7 సిక్సర్లు.. సచిన్ 7 ఫోర్లు.. ఒకప్పటిలా లెజెండ్స్ బ్యాటింగ్ విధ్వంసం.. వీడియోలు వైరల్

Yuvi-Sachin IML: యువీ 7 సిక్సర్లు.. సచిన్ 7 ఫోర్లు.. ఒకప్పటిలా లెజెండ్స్ బ్యాటింగ్ విధ్వంసం.. వీడియోలు వైరల్

Yuvi-Sachin IML: సచిన్ స్ట్రెయిట్ డ్రైవ్ ను.. యువరాజ్ లాఫ్టెడ్ సిక్సర్ ను ఇష్టపడనివాళ్లు ఎవరుంటారు? గ్రౌండ్ లో దిగి వీళ్లు షాట్లు కొడితే ఫ్యాన్స్ కు కిక్కే కిక్కు. ఇప్పుడు మరోసారి ఆ మజా దొరుకుతోంది. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో సచిన్, యువరాజ్ చెలరేగిపోయారు.

సచిన్ టెండుల్కర్,యువరాజ్ సింగ్ (PTI)

సచిన్ టెండుల్కర్, యువరాజ్ సింగ్ ఎప్పుడో ఆటకు రిటైర్ పలికారు. కానీ గ్రౌండ్ లో మాత్రం అదే క్లాస్ గేమ్ తో అదరగొడుతున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో ఈ లెజెండరీ ప్లేయర్స్ బ్యాటింగ్ తో సత్తాచాటుతున్నారు. క్లాసికల్ బ్యాటింగ్ తో ఫ్యాన్స్ కు కిక్కు ఇస్తున్నారు. మెరుపు షాట్లతో మెరుస్తున్నారు.

సచిన్ క్లాస్

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో సచిన్ క్లాస్ చూస్తే వావ్ అనాల్సిందే. ఈ టీ20 లీగ్ లో ధనాధన్ బ్యాటింగ్ తో మెరుపు షాట్లు ఆడుతున్నారు. సెమీస్ లో ఆస్ట్రేలియా మాస్టర్స్ టీమ్ పై సచిన్ చెలరేగాడు. 30 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు ఉన్నాయి. తన స్టైల్లో కవర్ డ్రైవ్, స్ట్రెయిట్ డ్రైవ్ తో కళాత్మక బ్యాటింగ్ తో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేశాడు.

యువీ విధ్వంసం

సెమీస్ లో ఆస్ట్రేలియా మాస్టర్స్ తో మ్యాచ్ లో ఇండియా మాస్టర్స్ తరపున యువరాజ్ సింగ్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 30 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. ఏడు సిక్సర్లతో రెచ్చిపోయాడు. వింటేజీ బ్యాటింగ్ తో మెస్మరైజ్ చేశాడు. లాఫ్టెడ్ షాట్లతో అలరించాడు. క్రీజులో కదులుతూ బంతిని స్టాండ్స్ లో పడేశాడు.

ఫైనల్లో ఇండియా

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆరంభ సీజన్ లో ఇండియా మాస్టర్స్ అదరగొడుతోంది. ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్ లో ఆస్ట్రేలియా మాస్టర్స్ పై 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఫస్ట్ ఇండియా మాస్టర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువరాజ్ సింగ్, సచిన్ చెలరేగారు. స్టువర్ట్ బిన్నీ (36), యూసుఫ్ పఠాన్ (23) కూడా అదరగొట్టారు.

ఛేజింగ్ లో ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. షాబాజ్ నదీం 4 వికెట్లతో మెరిశాడు. వినయ్ కుమార్, ఇర్ఫాన్ పఠాన్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫైనల్ ఆదివారం (మార్చి 16) జరుగుతుంది. మరో సెమీస్ లో నేడు (మార్చి 14) శ్రీలంక మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ మధ్య జరుగుతుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం