Champions Trophy: టీమ్ఇండియాకు గాయాల టెన్షన్.. ఆటగాళ్లు ఫిట్ గా ఉంటే హ్యాపీ.. టైటిల్ గెలవాలంటే అదే ముఖ్యం
Champions Trophy: టీమ్ఇండియాను ఆటగాళ్ల గాయాలు టెన్షన్ పెడుతున్నాయి. ఎప్పుడు ఏ ప్లేయర్ కు గాయం అవుతుందో అనే కంగారు వెంటాడుతోంది. ఇప్పటికే బుమ్రా దూరమయ్యాడు. పంత్ గాయం గుబులు రేపుతోంది.

ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీపై భారత క్రికెట్ జట్టు గురి పెట్టింది. ఫిబ్రవరి 19న ఆరంభమయ్యే ఈ టోర్నీలో విజేతగా నిలవడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తోంది. కానీ టోర్నీలో గెలుపు దిశగా జట్టు సాగాలంటే ముందు ఆటగాళ్లు ఫిట్ నెస్ తో ఉండటం ఎంతో ముఖ్యంగా. టీమ్ఇండియా ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారనే వార్తలు టెన్షన్ పెడుతున్నాయి.
పంత్ తప్పించుకున్నాడు కానీ
ఇంజూరీ రిస్క్ నుంచి వికెట్ కీపర్ రిషబ్ పంత్ తప్పించుకున్నట్లే కనిపిస్తున్నాడు. దుబాయ్ లో ప్రాక్టీస్ సెషన్ లో హార్దిక్ పాండ్య బలంగా కొట్టిన బంతి పంత్ మోకాలికి తగిలింది. నొప్పితో పంత్ బాధపడ్డాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు.
సర్జీర అయిన మోకాలికే బంతి తగిలిందనే వార్తలు గుబులు పుట్టించాయి. కానీ ఆ తర్వాత పంత్ ప్రాక్టీస్ కొనసాగించాడు. ఇప్పటికీ బాగానే ఉన్నా టోర్నీ సాగుతున్నా కొద్దీ అతని గాయం ఎలా ఉంటుందనే ఆందోళన రేకెత్తుతోంది.
షమిపై సస్పెన్సే
మరోవైపు పేసర్ మహమ్మద్ షమి ఫిట్ నెస్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. సర్జరీ తర్వాత దేశవాళీ క్రికెట్లో ఫిట్ నెస్, ఫామ్ చాటి షమి టీమ్ఇండియాలోకి వచ్చాడు. కానీ ఇంగ్లండ్ తో సిరీస్ లో అతను పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నట్లు కనిపించలేదు. పైగా రిథమ్ కూడా అందుకోలేదు.
ఇప్పటికే గాయంతో బుమ్రా దూరమవడంతో బౌలింగ్ దళాన్ని నడిపే బాధ్యత ఇప్పుడు షమీదే. అతని పని భారం పెరుగుతున్నా కొద్దీ ఫిట్ నెస్ ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు ప్రశ్న. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ఇండియా ట్రావెలింగ్ రిజర్వ్ ఓపెనర్ గా ఎంపికైన యశస్వి జైస్వాల్ కు చీలమండ గాయమైంది. అతని స్థానం ఇప్పుడు సందేహంలో పడింది.
సంబంధిత కథనం