Champions Trophy 2025:పాకిస్థాన్ గడ్డపై భారత జెండా.. ఛాంపియన్స్ ట్రోఫీలో త్రివర్ణ పతాకం రెపరెపలు.. దాయాదికి చెంపపెట్టు!
Champions Trophy 2025: పాకిస్థాన్ కు చెంపపెట్టు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శించని దాయాది దేశం ఇప్పుడు వెనక్కి తగ్గింది. కరాచి స్టేడియంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసింది.

పాకిస్థాన్ కు భారత సత్తా ఏమిటో మరోసారి తెలిసొచ్చింది. భారత ప్రజలతో పెట్టుకుంటే ఎలా ఉంటుంతో మరోసారి స్పష్టమైంది. ఇండియన్ ఫ్యాన్స్ దెబ్బకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై అన్ని వైపులా నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో వెనక్కి తగ్గిన పాకిస్థాన్.. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్బంగా కరాచి జాతీయ స్టేడియంలో భారత పతాకాన్ని ఆవిష్కరించింది. దాయాది గడ్డపై త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది.
అసలేమైందంటే?
ఏదైనా ఐసీసీ టోర్నీ సందర్భంగా నిబంధనల ప్రకారం పోటీపడే దేశాల జాతీయ జెండాలను మ్యాచ్ లు జరిగే వేదికల్లో కచ్చితంగా ప్రదర్శించాలి. కానీ భారత పతాకానికి మొదట చోటివ్వని పాకిస్థాన్ వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు తమ దేశానికి రావడానికి భారత జట్టు నిరాకరించడంతో ప్రతీకార చర్యగా పాక్ ఇలా చేసిందేనే విమర్శలు వచ్చాయి. మొదట గడాఫీ స్టేడియంలో, ఆ తర్వాత కరాచి స్టేడియంలోనూ భారత జెండాను ఏర్పాటు చేయలేదు.
ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్
భారత పతాకాన్ని పాకిస్థాన్ లో ఎగరేయకపోవడంతో ఇండియన్ ఫ్యాన్ ఫుల్ ఫైర్ అయ్యారు. పీసీబీని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ఈ వివాదం వైరల్ గా మారింది. దీనిపై వివరణ ఇచ్చిన పీసీబీ.. ‘‘మ్యాచ్ లు జరిగే సమయంలో ఐసీసీ, ఆతిథ్య జట్టు, పోటీపడే రెండు జట్ల జెండాలు మాత్రమే ఏర్పాటు చేయాలని ఐసీసీ చెప్పింది’’ అని పొంతన లేని మాటలు చెప్పింది.
ఇప్పుడు దిగొచ్చింది
ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశం అవడంతో పీసీబీ దిగొచ్చింది. తాజాగా కరాచి స్టేడియంలో భారత పతాకాన్ని ఆవిష్కరించింది. పోటీపడే అన్ని దేశాల జెండాలతో పాటు మన త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న భారత అభిమానులు.. పాకిస్థాన్ కు బుద్ధి వచ్చిందనే కామెంట్లు చేస్తున్నారు.
సంబంధిత కథనం