Champions Trophy: భారత పతాకం ఎక్కడ? పాకిస్థాన్ పై ఫైర్ అవుతున్న ఇండియన్ ఫ్యాన్స్.. వీడియో వైరల్
Champions Trophy: భారత్ పట్ల పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాక్.. భారత జాతీయ పతాకాన్ని స్టేడియంలో ఎగరనివ్వలేదు. దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

భారత్ పై ఎప్పుడూ దురుద్దేశంతో వ్యవహరించే పాకిస్థాన్ మరోసారి వక్ర బుద్ధిని బయటపెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి తీవ్ర విమర్శలు పాలవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న ఆ దేశం కరాచి జాతీయ స్టేడియంలో భారత జాతీయ జెండాకు చోటునివ్వలేదు. దీంతో అందరూ పాకిస్థాన్ పై మండిపడుతున్నారు.
నిబంధనలను మీరి
నిబంధనల ప్రకారం ఐసీసీ టోర్నీలకు ఆతిథ్యమిచ్చే స్టేడియాల్లో పాల్గొనే జట్ల జాతీయ పతాకాలు కచ్చితంగా ఉండాలి. కానీ తాజాగా కరాచి జాతీయ స్టేడియంలో మిగిలిన ఏడు జట్ల ఫ్లాగ్ లను ఏర్పాటు చేసిన పాకిస్థాన్.. త్రివర్ణ పతాకానికి చోటునివ్వలేదు. ఐసీసీ నిబంధనలు మీరి మరి భారత జాతీయ జెండాను పాక్ పక్కనపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కక్షపూరితంగా
భారత జాతీయ జెండా విషయంలో పాకిస్థాన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ ఆ దేశానికి వెళ్లలేదు. భద్రతా కారణాల రీత్యా పాక్ లో ఆడేందుకు నిరాకరించింది. దీంతో ఈ టోర్నీలో భారత్ మ్యాచ్ లను దుబాయ్ లో ఆడించబోతున్నారు. భారత్ తమ దేశానికి రాలేదు కాబట్టే ఇప్పుడు ఆ దేశ జెండాను పాకిస్థాన్ కావాలని పక్కనపెట్టింది.
పాక్ పై విమర్శలు
పాకిస్థాన్ చేసిన పనికి భారత అభిమానులు ఫైర్ అవుతున్నారు. పిల్లచేష్టలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. అక్కడ ఐసీసీ ఛైర్మన్ గా జై షా ఉన్నాడని, పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్ అతని చేతులో ఉంది జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా అయితే పాకిస్థాన్ లో క్రికెట్ అనేది మిగలదని మండిపడుతున్నారు.
సంబంధిత కథనం