IND vs SL 1st T20 Live Streaming: టీ20 వరల్డ్ ఛాంపియన్స్ టీమిండియా మరో టీ20 సిరీస్ కు సిద్ధమైంది. కొత్త కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా ఈరోజే (జులై 27) తొలి టీ20 జరగనుంది. పల్లెకెలెలో జరగబోయే ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలను చూద్దాం.
పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో జరగనున్న తొలి టీ20 మ్యాచ్ తో టీమిండియా ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ తొలి శకం ప్రారంభమైంది. భారత శాశ్వత టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కు ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. గతంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లపై నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించి మంచి ప్రదర్శన చేశాడు.
ఈ పర్యటనలో విశ్రాంతి తీసుకున్న తమ స్ట్రైక్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సేవలను కూడా భారత్ కోల్పోనుంది. శ్రీలంకతో సిరీస్ లో రియాన్ పరాగ్, రింకు సింగ్ వంటి యువ ఆటగాళ్లకు ఇది పెద్ద పరీక్ష కానుంది. వైట్ బాల్ క్రికెట్లో వైస్ కెప్టెన్ గా పదోన్నతి పొందిన శుభ్‌మన్ గిల్ పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జులై 27, 2024 శనివారం రాత్రి 7 గంటలకు భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది.
పల్లెకెలెలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది.
భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే తొలి టీ20 మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సోనీ స్పోర్ట్స్ టెన్ 1, సోనీ స్పోర్ట్స్ టెన్ 1 హెచ్ డీ, సోనీ స్పోర్ట్స్ టెన్ 5 హెచ్ డీ టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
భారత్- శ్రీలంక జట్ల మధ్య జరిగే తొలి టీ20 మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సోనీలైవ్లో అందుబాటులో ఉంది.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత గిల్ కెప్టెన్సీలో జింబాబ్వే టూర్లోనూ 4-1తో గెలిచిన టీమిండియా.. ఇప్పుడు శ్రీలంక సిరీస్ లో ఎలా ఆడనున్నది చూడాలి. ముఖ్యంగా ఆ వరల్డ్ కప్ గెలిచిన జట్టులోని రోహిత్, కోహ్లి, జడేజా రిటైరవడంతో టీమ్ లోని యువ ప్లేయర్స్ కు తమను తాము నిరూపించుకోవడానికి ఇదే మంచి అవకాశం.
జులై 27, 28 30వ తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఆ తర్వాత ఆగస్ట్ 2 నుంచి 7 వరకు మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది.