IND vs SA Match Timings: దక్షిణాఫ్రికాతో మరికొన్ని గంటల్లో టీ20 సిరీస్‌ను ఆడనున్న టీమిండియా.. డిఫరెంట్ మ్యాచ్ టైమింగ్స్
IND vs SA T20 Series: భారత్, దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం నుంచి నాలుగు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది. అయితే.. మ్యాచ్‌లు మాత్రం భారత్ కాలమాన ప్రకారం.. మూడు ఒక టైమింగ్‌కి, ఒక మ్యాచ్ మాత్రం గంట ముందే ప్రారంభంకానుంది.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడేందుకు ఇప్పటికే సఫారీ గడ్డపైకి చేరుకున్న టీమిండియా.. మరికొన్ని గంటల్లో తొలి టీ20 మ్యాచ్‌ను ఆడనుంది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్-2024లో దక్షిణాఫ్రికా జట్టుని ఫైనల్లో ఓడించిన భారత్ జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో తొలి టీ20 నుంచి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాపై సఫారీలు రివేంజ్ తీర్చుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది.
న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ జట్టు 0-3 తేడాతో ఓడిపోయింది. అయితే.. ఆ జట్టులో ఏ ప్లేయర్ కూడా ఈ సఫారీ పర్యటనలో లేడు. ఆ టెస్టు టీమ్ త్వరలోనే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడేందుకు కంగారూల గడ్డపైకి వెళ్లనుంది. అయితే భారత్ స్టార్ ప్లేయర్లు కొంత మంది లేకపోయినప్పటికీ.. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ టీ20 జట్టు బలంగానే కనిపిస్తోంది.
భారత్ VS దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే
Date | Fixture | Venue | Timing |
November 8, 2024 | India vs South Africa 1st T20I | Kingsmead, Durban | 8.30pm IST, 5pm local time |
November 10, 2024 | India vs South Africa 2nd T20I | St. George's Park, Gqeberha | 7.30pm IST, 4pm local time |
November 13, 2024 | India vs South Africa 3rd T20I | SuperSport Park, Centurion | 8.30pm IST, 5pm local time |
November 15, 2024 | India vs South Africa 4th T20I | The Wanderers, Johannesburg | 8.30pm IST, 5pm local time |
టీ20 మ్యాచ్‌లను ఎక్కడ చూడొచ్చు
టీవీల్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్‌ను స్పోర్ట్స్ 18, కలర్స్ సినీప్లెక్స్ ఛానళ్లలో వీక్షించొచ్చు. ఆన్‌లైన్‌లో జియో సినిమాలో టీ20 మ్యాచ్‌లు స్ట్రీమింగ్‌కానున్నాయి.
భారత టీ20 జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్.
దక్షిణాఫ్రికా టీ20 జట్టు
ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నెయిల్ బార్ట్మన్, గెరాల్డ్ కోట్జీ, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలి ఎంపోంగ్వానా, నకాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, ఆండిలే సిమెలేన్, ట్రిస్టన్ స్టబ్స్, లుథో సిపామ్లా ( 3, 4 టీ20లకి మాత్రమే)