(1 / 6)
T20 World Cup Final Weather: టీ20 వరల్డ్ కప్ 2024లో చాలా మ్యాచ్ లకు వర్షం అడ్డుతగిలింది. కొన్ని మ్యాచ్ లు రద్దు కాగా.. మరికొన్ని కాస్త ఆలస్యంగానైనా ముగిశాయి. ఇండియా, ఇంగ్లండ్ సెమీఫైనల్ కూడా వర్షం వల్ల ప్రభావితమైనా మొత్తానికి ఆలస్యంగానైనా జరిగి ఇండియా విజేతగా నిలిచింది. ఇప్పుడు బార్బడోస్ లో జరగబోయే ఫైనల్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది.
(2 / 6)
T20 World Cup Final Weather: ఇండియా, సౌతాఫ్రికా మధ్య టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పై ఇండియా 68 పరుగులతో గెలవగా.. ఆఫ్ఘనిస్థాన్ పై సౌతాఫ్రికా 9 వికెట్లతో విజయం సాధించింది. తొలిసారి ఓ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికా తలపడనుంది.
(3 / 6)
T20 World Cup Final Weather: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. బార్బడోస్ లో ఈ ఫైనల్ జరగాల్సి ఉండగా.. మ్యాచ్ రోజు అయిన శనివారం (జూన్ 29), రిజర్వ్ డే అయిన ఆదివారం (జూన్ 30) కూడా అక్కడ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి.
(4 / 6)
T20 World Cup Final Weather: అక్యువెదర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం.. శనివారం (జూన్ 29) ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. రోజంతా 99 శాతం ఆకాశం మేఘావృతమై ఉండనుండగా.. వర్షం పడే అవకాశాలు 47 శాతం ఉన్నాయి.
(5 / 6)
T20 World Cup Final Weather: ఇక రిజర్వ్ డే అయిన ఆదివారం (జూన్ 30) కూడా చాలా వరకు వాతావరణం మేఘవృతమై, ఉక్కపోతగా ఉండనుంది. మధ్యాహ్నం సమయంలో వర్షం పడనుంది.
(6 / 6)
T20 World Cup Final Weather: నిజానికి ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరగబోయే ఈ ఫైనల్ కోసం రెండు రోజులూ అదనంగా మరో 190 నిమిషాలను ఐసీసీ కేటాయించింది. ఒకవేళ అప్పటికి కూడా మ్యాచ్ సాధ్యం కాకపోతే ఇండియా, సౌతాఫ్రికాలను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
ఇతర గ్యాలరీలు