IND vs SA 2nd T20 Live: మళ్లీ టాస్ ఓడిన సూర్యకుమార్ యాదవ్, దక్షిణాఫ్రికా టీమ్‌లో మార్పులు-india vs south africa 2nd t20 match sa won the toss and opt to bowl ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sa 2nd T20 Live: మళ్లీ టాస్ ఓడిన సూర్యకుమార్ యాదవ్, దక్షిణాఫ్రికా టీమ్‌లో మార్పులు

IND vs SA 2nd T20 Live: మళ్లీ టాస్ ఓడిన సూర్యకుమార్ యాదవ్, దక్షిణాఫ్రికా టీమ్‌లో మార్పులు

Galeti Rajendra HT Telugu
Nov 10, 2024 07:22 PM IST

IND vs SA 2nd T20 Toss: దక్షిణాఫ్రికా గడ్డపై గత శుక్రవారం తొలి టీ20లో ఘన విజయంతో బోణి కొట్టిన టీమిండియా.. ఆదివారం రెండో టీ20లోనూ అదే జోరుని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ ఓడిపోయాడు.

రెండో టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా
రెండో టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికాతో గెబేహా వేదికగా ఆదివారం జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ ఓడిపోయాడు. తొలి టీ20 తరహాలోనే టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఆడెన్ మర్‌క్రమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

డర్బన్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20లో 61 పరుగుల తేడాతో భారత్ జట్టు అలవోకగా గెలవడంతో.. టీమ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ.. దక్షిణాఫ్రికా కెప్టెన్ మాత్రం క్రూజర్‌ను తప్పించి.. అతని స్థానంలో మాశ్చర్‌ని టీమ్‌లోకి తీసుకున్నాడు.

భారత్ తుది జట్టు

సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అవేష్ ఖాన్

దక్షిణాఫ్రికా తుది జట్టు

రియాన్ రికెల్టన్, ఏడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సెన్, ఆండిలె సిమెలేన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, ఎన్‌ఖబాయోజ్మి పీటర్, మాశ్చర్‌

సూపర్ ఫామ్‌లో సంజూ

భారత్ జట్టులో ఓపెనర్ సంజు శాంసన్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉండగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. అలానే

తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ కూడా తొలి టీ20లో దూకుడుగా ఆడారు. కానీ.. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్య తొలి టీ20లో తక్కువ స్కోరుకే ఔటైపోయారు. దాంతో ఈ ఇద్దరూ కూడా టచ్‌లోకి వస్తే భారత్ జట్టు మెరుగైన స్కోరుని సాధించే అవకాశం ఉంటుంది.

బౌలింగ్‌లో ఆ ఇద్దరే

బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తొలి టీ20లో అదరగొట్టేశారు. కానీ.. అవేష్ ఖాన్, అక్షర్ పటేల్‌ ఇంకా సఫారీ గడ్డపై నిరూపించుకోవాల్సి ఉంది. అర్షదీప్ సింగ్ ఒక వికెట్ పడగొట్టినా.. పరుగులు ఇచ్చేశాడు.

ఫస్ట్ టీ20 స్కోరు ఇలా

తొలి టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 202 పరుగులు చేయగా.. ఛేదనలో దక్షిణాఫ్రికా టీమ్ 141 పరుగులకే ఆలౌటైంది. దాంతో నాలుగు టీ20ల ఈ సిరీస్‌లో భారత్ జట్టు ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సిరీస్‌ను సమం చేసేందుకు దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో గట్టిగా ఫైట్ చేసే అవకాశం ఉంది.

Whats_app_banner