India vs Pakistan : భారత్- పాక్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు.. భారీగా భద్రతా ఏర్పాట్లు!
India vs Pakistan T20 world Cup : భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో అలజడులు సృష్టించాలని ఐసిస్- కే పిలుపునిచ్చింది. ఫలితంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారు.
India vs Pakistan T20 world Cup match : ఇంకొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. కానీ.. అందరి చూపు జూన్ 9న జరిగే భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌పైనే! అయితే.. న్యూయార్క్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు పొంచి ఉందని సమాచారం. మ్యాచ్‌లో దాడులకు పాల్పడి అలజడులు సృష్టించాలని ఐసిస్-కే బృందం.. ఉగ్రవాదులకు పిలుపునివ్వడం ఇందుకు కారణం. ఈ పరిణామాలపై వేగంగా స్పందించిన పోలీసులు.. నాసౌ క్రికెట్ స్టేడియంలో భారీ భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.
"భారత్- పాక్ మ్యాచ్‌కి ఉగ్ర ముప్పు పొంచి ఉంది. అందుకే పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము," అని నాసౌ కౌంటీ పోలీస్ కమిషనర్ పాట్రిక్ రైడర్ తెలిపారు.
India vs Pakistan t20 world cup : ఏప్రిల్ తొలినాళ్ల నుంచి మ్యాచ్‌కు ఉగ్ర ముప్పుపై వార్తలు వస్తున్నాయని అన్నారు రైడర్. మ్యాచ్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లో జాప్యం కలగకుండా చూసుకుంటున్నట్టు వివరించారు.
"ఏప్రిల్ నుంచే టోర్నీకి ఉగ్ర ముప్పు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు.. ప్రత్యేకించి ఇండియా- పాక్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌నే టార్గెట్ చేస్తున్నట్టు తేలింది," అని రైడర్ అన్నారు. ఫలితంగా.. మ్యాచ్ జరగుతున్న స్టేడియం చుట్టూ డ్రోన్స్‌తో గస్తీ ఏర్పాట్లు చేశారు.
మరోవైపు.. మ్యాచ్ నేపథ్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులకు ఆదేశాళిచ్చారు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోల్చల్.
India vs Pakistan t20 world cup 2024 : "ఇప్పటికైతే అంతా బాగానే ఉంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాము. ఫెడరల్ ఏజెన్సీలతో మా బృందాలు కొన్ని నెలలుగా పనిచేస్తున్నాయి. న్యూయార్క్ ప్రజలు, సందర్శకుల రక్షణ మాకు ముఖ్యం," అని కాథీ చెప్పుకొచ్చారు.
భారత్- పాక్ మ్యాచ్ భద్రతా ఏర్పాట్లపై నాసౌ కౌంటీ హెడ్ బ్రూస్ బ్లాక్మాన్ స్పందించారు.
"ప్రతి విషయాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తాము. దేనినీ తక్కువ చేసి చూడము. అన్నింటిని ట్రాక్ చేస్తాము," అని బ్రూస్ అన్నారు.
India vs Pakistan : ఇక మ్యాచ్ నాటికి.. భద్రతా ఏర్పాట్లను మరింత పెంచే అవకాశం ఉంది. స్థానిక ఆసుపత్రులు అలర్ట్‌గా ఉంటాయి. అదనపు పోలీసు బలగాలను మోహరిస్తారు.
డ్రోన్ ద్వారా కూడా దాడులు చేసే అవకాశం ఉన్నందున.. మ్యాచ్ జరుగుతున్న ప్రాంతంలో నో ఫ్లై జోన్‌ని ప్రకటించారు అధికారులు.
కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఈ ఐసిస్-కే! దక్షిణ- మధ్య ఆసియాపై దీని పెట్టు ఎక్కువగా ఉంటుంది. మాస్కోలో జరిగిన ఉగ్రదాడి ఈ ఉగ్రవాద సంస్థే చేసింది. అందుకే.. ఐసిస్-కే ఉగ్రవాద ప్రకటనలను న్యూయార్క్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
సంబంధిత కథనం