India vs Pakistan Live Details: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ టైమ్, లైవ్ స్ట్రీమింగ్, టీవీ ఛానెల్ వివరాలివే
India vs Pakistan Live Details: చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య రేపు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టైమింగ్స్ లైవ్ టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే.
India vs Pakistan Live Details: అందరూ ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ క్రికెట్ సమరానికి సమయం ఆసన్నమవుతోంది. ఆసియాకప్ 2023లో భాగంగా టీమిండియా, పాక్ మధ్య రేపు (సెప్టెంబర్ 2) మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా ఈ గ్రూప్-ఏ వన్డే మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులంతా చిరకాల ప్రత్యర్థులైన ఇండియా, పాక్ పోరు కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ రెండు జట్లు ఇప్పుడు తలపడనున్నాయి. ఈ ఏడాది ఆసియాకప్‍లో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‍లో నేపాల్‍ను ఓడించింది. పాక్‍తో మ్యాచ్‍తోనే ఆసియాకప్ సమరాన్ని భారత్ ఆరంభించనుంది. రోహిత్ సేన సారథ్యంలోని భారత జట్టు.. పాక్‍ను చిత్తు చేసి ఆసియాకప్‍లో శుభారంభం చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు వన్డే ర్యాంకింగ్‍ల్లో టాప్‍కు చేరిన పాక్ ఉత్సాహంగా ఉంది. టీమిండియా, పాకిస్థాన్ మధ్య రేపు జరగనున్న మ్యాచ్ టైమ్, లైవ్ స్ట్రీమింగ్, లైవ్ టెలికాస్ట్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ట్రెండింగ్ వార్తలు
ఇండియా vs పాకిస్థాన్: టైమ్ ఇలా..
ఆసియాకప్‍లో ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ రేపు (సెప్టెంబర్ 2, శనివారం) జరగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. టాస్ మధ్యాహ్నం 2.30 గంటలకు పడుతుంది. శ్రీలంకలోనే పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
టీవీలో ఎక్కడ చూడొచ్చు?
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్‌లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లలో ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు.
ఇండియా vs పాకిస్థాన్: లైవ్ స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో?
ఆసియాకప్‍లో ఇండియా, పాకిస్థాన్ మధ్య రేపు జరిగే మ్యాచ్ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఉచితంగానే ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్: శుభ్‍మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/అక్షర్ పటేల్, కుల్‍దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్‍ప్రీత్ బుమ్రా
పాకిస్థాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమాముల్ హక్, మహమ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్, సల్మాన్ అఘా, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, షాహీన్ షా ఆఫ్రిదీ, నసీమ్ షా, హరిస్ రవూఫ్
ఆసియా కప్ టోర్నీల్లో ఇప్పటి వరకు భారత్, పాకిస్థాన్ మధ్య 16 మ్యాచ్‍లు (13 వన్డే ఫార్మాట్‍లో, 3 టీ20లు) జరిగాయి. ఇందులో తొమ్మిది మ్యాచ్‍ల్లో టీమిండియా గెలిచింది. పాక్ కేవలం ఆరుసార్లు గెలిచింది. చివరి ఐదు వన్డే ఆసియాకప్ మ్యాచ్‍ల్లో పాక్‍పై భారత్ నాలుగుసార్లు గెలిచింది. ఎలా చూసినా ఆసియాకప్‍లో పాకిస్థాన్‍పై ఇండియా రికార్డు చాలా మెరుగ్గా ఉంది.
టాపిక్