Champions Trophy: 2017 ఛాంపియన్స్ ట్రోఫీ - పాకిస్థాన్‌తో రెండు సార్లు తలపడ్డ టీమిండియా - ఫైనల్‌లో బోల్తా!
2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో టీమిండియా రెండు సార్లు తలపడింది. గ్రూప్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విన్నర్‌గా నిలిచింది. ఫైనల్‌లో మాత్రం భారత జట్టును చిత్తు చేసిన పాకిస్థాన్ కప్ సొంతం చేసుకున్నది.

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్‌లో అడుగుపెట్టింది టీమిండియా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో పాటు ప్రధాన ఆటగాళ్లు అందరూ దుబాయ్ చేరుకున్నారు. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఫిబ్రవరి 20న తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను టీమిండియా ఎదుర్కోనుంది.ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.
ఫైనల్ ఓటమికి...
ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్నారు. గత ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఎదురుచూస్తోంది.
రెండుసార్లు...
2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో టీమిండియా రెండు సార్లు తలపడింది. గ్రూప్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజేతగా నిలవగా...ఫైనల్‌లో మాత్రం భారత జట్టును చిత్తు చేసి పాకిస్థాన్ టైటిల్ ఎగరేసుకుపోయింది.
రోహిత్ శర్మ టాప్ స్కోరర్...
గ్రూప్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 124 పరుగులు తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 91 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లి (81 రన్స్), శిఖర్ ధావన్ (68 పరుగులు), యువరాజ్ సింగ్ (58 రన్స్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా యాభై ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 319 పరుగులు చేసింది.
వర్షం కారణంగా పాకిస్థాన్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 289 పరుగులకు కుదించారు. భారత బౌలర్ల జోరుతో పాకిస్థాన్ 33 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది. ఉమేష్ యాదవ్ 3, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లతో పాకిస్థాన్‌ను దెబ్బకొట్టారు.
ఫైనల్‌లో రివర్స్...
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. టీమిండియాను చిత్తు చేసి పాకిస్థాన్ కప్పు సొంతం చేసుకున్నది. ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 338 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫకర్ జమాన్ (114 రన్స్) సెంచరీతో చెలరేగగా...అజార్ అలీ, మహ్మద్ హఫీజ్ హాఫ్ సెంచరీలు సాధించారు.
టీమిండియా స్టార్ బౌలర్లు బుమ్రా, అశ్విన్ ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యారు. తొమ్మిది ఓవర్లు వేసిన బుమ్రా ఒక్క వికెట్ తీయకుండా 68 పరుగులు ఇచ్చాడు. అశ్విన్ పది ఓవర్లలో 70 పరుగులు ఇచ్చాడు.
హార్దిక్ పాండ్య ఒక్కటే...
లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్‌మెన్స్ చేతులెత్తేశారు. రోహిత్ శర్మ, కోహ్లి, ధోనీ సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు. 30 ఓ వర్లలో టీమిండియా 158 పరుగులకే ఆలౌటైంది. హార్దిక్ పాండ్య 46 బాల్స్‌లో 76 పరుగులతో చెలరేగడంతో టీమిండియా ఈ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. పాకిస్థాన్ చేతిలో 180 పరుగులతో తేడాతో టీమిండియా ఓటమి పాలైంది.
సంబంధిత కథనం