IND vs NZ 1st Test Toss: టాస్ గెలిచిన రోహిత్ శర్మ, భారత్ తుది జట్టులో రెండు మార్పులు
India vs New Zealand 1st Test Match: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఎట్టకేలకి సర్ఫరాజ్ ఖాన్‌కి తుది జట్టులో చోటు దక్కగా.. ముగ్గురు స్పిన్నర్లకి రోహిత్ ఛాన్స్ ఇచ్చాడు.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగళూరు వేదికగా తొలి టెస్టు మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. మ్యాచ్‌లో రెండో రోజైన గురువారం ఉదయం 15 నిమిషాల ముందే టాస్ వేయగా.. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

భారత్ తుది జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ రెండు మార్పులు చేశాడు. మెడ నొప్పి కారణంగా మ్యాచ్‌కి శుభమన్ గిల్ దూరమవగా.. అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం దక్కింది. అలానే బౌలింగ్‌లో ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు లభించింది. దాంతో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాతో కలిపి ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన సిరీస్‌లో ఇద్దరు స్పిన్నర్లతోనే భారత్ ఆడిన విషయం తెలిసిందే.
భారత్ తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్ తుది జట్టు
టామ్ లాథమ్ (కెప్టెన్), దేవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్
ఈరోజు 98 ఓవర్లు టార్గెట్
బెంగళూరులో వర్షం కారణంగా మ్యాచ్‌లో తొలి రోజైన బుధవారం మూడు సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోయింది. దాంతో ఈరోజు మొదటి సెషన్ ఉదయం 9.15 గంటలకు ప్రారంభమవుతుంది. సాధారణంగా ఉదయం 9.30 గంటలకి ఆట ప్రారంభమయ్యేది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 12.10 గంటల నుంచి 2.25 గంటల వరకు జరుగుతుంది. మూడో సెషన్ మధ్యాహ్నం 2.45 గంటల నుంచి 4.45 గంటల వరకు జరగనుంది. తొలి రోజు 98 ఓవర్లు ఆడేలా అంపైర్లు ప్లాన్ చేస్తున్నారు.
హెడ్ టు హెడ్ రికార్డులు
భారత్ గడ్డపై ఇప్పటి వరకు 12 టెస్టు సిరీస్‌లు ఆడిన న్యూజిలాండ్ టీమ్.. కనీసం ఒక్క సిరీస్‌లో కూడా విజయం సాధించలేదు. భారత్ జట్టు 10 సిరీస్‌లను కైవసం చేసుకుని.. రెండింటిని డ్రాగా ముగించింది. అలానే భారత్ గడ్డపై ఇప్పటి వరకు 36 టెస్టు మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్ టీమ్.. కేవలం రెండింటిలో మాత్రమే టీమిండియాను ఓడించగలిగింది. మిగిలిన 34లో 17 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌పై గెలిచిన భారత్, 17 మ్యాచ్‌లను డ్రాగా ముగించింది.