IND vs NZ 1st Test Live: ఈరోజు 15 నిమిషాల ముందే ఆట మొదలు, కానీ రెండు టీమ్స్‌కి తప్పని టెన్షన్
Bengaluru Weather: భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టులో మొదటి రోజు ఆట వర్షార్పణం అయ్యింది. గురువారం ఉదయం నుంచి బెంగళూరులో వర్షం లేదు. కానీ టీమ్స్‌ను టెన్షన్ పెడుతున్న విషయం ఏంటంటే?
భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్‌కి మొదటి రోజైన బుధవారం (అక్టోబరు16)న వరుణుడు అడ్డుపడ్డాడు. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్ బుధవారం ఉదయం ప్రారంభంకావాల్సి ఉండగా.. వర్షం కారణంగా కనీసం టాస్ కూడా నిన్న సాధ్యం కాలేదు. దాంతో మ్యాచ్‌లో రెండో రోజైన గురువారం 15 నిమిషాల ముందే ఆటని ప్రారంభించాలని అంపైర్లు నిర్ణయించారు.
వాస్తవానికి మ్యాచ్‌లో తొలి రోజు టాస్ ఉదయం 9 గంటలకి పడుతుంది. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను 9.30లకి ప్రారంభిస్తుంటారు. కానీ.. బుధవారం మూడు సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోవడంతో రెండో రోజైన గురువారం ఉదయం టాస్‌ను 8.45 గంటలకే వేయాలని అంపైర్లు నిర్ణయించారు. ఆ తర్వాత అరగంటలో అంటే.. 9.15 గంటలకి తొలి సెషన్ ప్రారంభంకానుంది.
బుధవారం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా వర్షం పడగా.. గురువారం మాత్రం ఉదయం వర్షం లేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలోని మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఈరోజు కూడా ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల లోపు వర్షం పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో మ్యాచ్ సజావుగా సాగడం అనుమానమే.
మార్చిన టైమింగ్స్ ప్రకారం.. మూడు సెషన్లు టైమింగ్స్ ఇలా
మొదటి సెషన్ ఉదయం 9.15 నుంచి 11.30 వరకు
రెండో సెషన్ మధ్యాహ్నం 12.10 నుంచి 2.25 వరకు
మూడో సెషన్ మధ్యాహ్నం 2.45 నుంచి సాయంత్రం 4.45 వరకు
భారత్ టెస్టు టీమ్
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, సర్ఫరాజ్ ఖాన్ .
న్యూజిలాండ్ టెస్టు జట్టు
టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్ వెల్ (మొదటి టెస్టుకి మాత్రమే), కేన్ విలియమ్సన్ (మొదటి టెస్టుకి అందుబాటులో లేడు), మ్యాట్ హెన్రీ, డార్లీ మిచెల్, విల్ ఓ రూర్కే, ఇస్ సోధి (రెండు, మూడో టెస్టుకి మాత్రమే), టిమ్ సౌథీ, విల్ యంగ్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, దేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బెన్ సియర్స్.