IND vs ENG: హార్దిక్.. సెట్ అయ్యేందుకు 25 బంతులా: భారత మాజీ కీపర్ విమర్శలు.. జురెల్‍ను వేస్ట్ చేశారన్న ఇంగ్లండ్ మాజీ
.IND vs ENG T20 Series: ఇంగ్లండ్‍తో మూడో టీ20లో భారత్ ఓటమి పాలైంది. లక్ష్యఛేదనలో కీలక సమయంలో హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడలేకపోయాడు. ఈ విషయంపై విమర్శలు వస్తున్నాయి. హార్దిక్ తీరును భారత మాజీ ప్లేయర్ తప్పుబట్టారు.
ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍లో తొలి రెండు గెలిచిన భారత్.. మూడో మ్యాచ్‍లో ఓటమి పాలైంది. మూడో టీ20 గెలిచిన ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‍ల సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. రాజ్‍కోట్ వేదికగా మంగళవారం (జనవరి 28) జరిగిన మ్యాచ్‍లో టీమిండియా 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. దీంతో సిరీస్ ప్రస్తుతం 2-1తో ఉంది. ఈ మ్యాచ్‍లో భారత స్టార్ ఆల్‍రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక సమయంలో బ్యాట్ ఝలింపించలేకపోయాడు. హిట్టింగ్ చేసేందుకు ఇబ్బందులు పడ్డాడు.
ఈ మూడో టీ20లో టాపార్డర్ విఫలమైంది. అయితే, కీలక సమయంలో హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ హిట్టింగ్ చేయకుండా నిదానంగా ఆడారు. బౌండరీలు ఎక్కువగా బాదలేకపోయారు. దీంతో టీమిండియా ఒత్తిడిలో కూరుకుపోయి.. చివరికి కనీసం పోరాడినట్టు కనిపించలేదు. ముఖ్యంగా తొలుత హార్దిక్ దూకుడు ఆడలేక తడబడ్డాడు. ఈ విషయంపై హార్దిక్ ఆటతీరును భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ తప్పుపట్టాడు.
సెట్ అయ్యేందుకు 20 బంతులా..
ఈ మ్యాచ్‍లో హార్దిక్ పాండ్యా 35 బంతుల్లో 40 పరుగులే చేశాడు. ఓ దశలో 24 బంతుల్లో కేవలం 21 రన్స్ వద్దే ఉన్నాడు. సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతున్నా అందుకు తగ్గట్టుగా హిట్టింగ్ చేయలేకపోయాడు. దీనిపై పార్థివ్ పటేల్ మాట్లాడాడు.
టీ20 మ్యాచ్‍లో సెట్ అయ్యేందుకు ఎవరూ 25 బంతుల వరకు తీసుకోకూడదని మ్యాచ్ తర్వాత పార్థివ్ అన్నాడు. “సెట్ అయ్యేందుకు 20-25 బంతులు తీసుకోకూడదు. సమయం తీసుకోవాలని అనుకోవడాన్ని నేను అర్థం చేసుకుంటా. కానీ కనీసం స్ట్రైక్ అయినా రొటేట్ చేస్తుండాలి. 35 బంతుల్లో హార్దిక్ 40 పరుగులు చేసి ఉండొచ్చు. కానీ బ్యాటింగ్‍కు దిగిన మొదట్లో అతడు చాలా డాట్ బాల్స్ ఆడాడు” అని పార్థివ్ అన్నాడు.
బ్యాటింగ్ ఆర్డర్ తప్పు.. జురెల్ అప్పుడా..
ఈ మ్యాచ్‍ల టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేదని, ఆ విషయంలో తప్పు చేసిందని ఇంగ్లండ్ మాజీ స్టార్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. జురెల్‍ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‍కు పంపడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. జురెల్‍ను వేస్ట్ చేశారని అన్నాడు.
జురెల్‍ను చివర్లో పంపడం సరికాదని పీటర్సన్ చెప్పాడు. “భారత్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేదు. ధృవ్ జురెల్ మంచి ప్లేయర్. లెఫ్ట్, రైట్ కాంబినేషన్ కోసం అతడిని అంత లోయర్ ఆర్డర్‌లో పంపడం సరికాదు. బెస్ట్ బ్యాటర్లు ముందు రావాలని నేను నమ్ముతా” అని పీటర్సన్ అన్నాడు.
లెఫ్ట్, రైట్ కాంబినేషన్ అనేది టాప్-4కు సరైనదే అని, కానీ ఆ తర్వాత బెస్ట్ బ్యాటర్ల ప్రకారమే ఆర్డర్ ఉండాలని పార్థివ్ పేటేల్ చెప్పాడు. జురెల్ ఓ ప్రాపర్ బ్యాటర్ అని, పెద్ద ఇన్నింగ్స్ ఆడగలడని అన్నాడు.
మూడో టీ20లో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత బౌలింగ్‍లో ఐదు వికెట్లు పడగొట్టాడు. కానీ లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా చివరికి ఓటమి పాలైంది. భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ20 జనవరి 31వ తేదీన పుణె వేదికగా జరగనుంది.
సంబంధిత కథనం