India vs England Highlights: రోహిత్ సిక్స్.. ఆండర్సన్‌తో గొడవ.. కోహ్లిని సమం చేసిన యశస్వి.. విజయానికి చేరువలో ఇండియా-india vs england highlights rohit anderson heated exchange yashasvi equlas virat kohli record ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  India Vs England Highlights Rohit Anderson Heated Exchange Yashasvi Equlas Virat Kohli Record

India vs England Highlights: రోహిత్ సిక్స్.. ఆండర్సన్‌తో గొడవ.. కోహ్లిని సమం చేసిన యశస్వి.. విజయానికి చేరువలో ఇండియా

Hari Prasad S HT Telugu
Feb 26, 2024 11:44 AM IST

India vs England Highlights: ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ నాలుగో రోజు తొలి సెషన్ లో హైడ్రామా నెలకొంది. రోహిత్ తన బౌలింగ్ లో సిక్స్ కొట్టిన తర్వాత ఆండర్సన్ గొడవ.. మరోవైపు విరాట్ కోహ్లిని సమం చేసిన యశస్వి జైస్వాల్ లాంటి హైలైట్స్ ఉన్నాయి.

రోహిత్ శర్మ, ఆండర్సన్ మధ్య గొడవ
రోహిత్ శర్మ, ఆండర్సన్ మధ్య గొడవ

India vs England Highlights: ఇంగ్లండ్ పై నాలుగో టెస్టుతోపాటు సిరీస్ విజయానికి టీమిండియా విజయానికి చేరువైంది. అయితే నాలుగో రోజు ఉదయం సెషన్ లో మాత్రం కొన్ని ట్విస్టులు ఉన్నాయి. రోహిత్ శర్మ, ఆండర్సన్ గొడవ పడటం ఒక విశేషమైతే.. ది గ్రేట్ విరాట్ కోహ్లి రికార్డును ఓపెనర్ యశస్వి జైస్వాల్ సమం చేయడం మరో విశేషం.

ట్రెండింగ్ వార్తలు

రోహిత్, ఆండర్సన్ గొడవ

ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు తొలి సెషన్ ఆసక్తికరంగా సాగింది. మూడో రోజు ముగిసే సమయానికి సులువుగా గెలుస్తుందనుకున్న టీమిండియా.. నాలుగో రోజు తొలి సెషన్ లో కష్టాల్లో పడింది. అయితే తొలి సెషన్ తొలి గంట పాటు ఇండియా హవా కొనసాగింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ ఊపు మీద కనిపించాడు.

మూడు ఫోర్ల, ఒక సిక్స్ కొట్టి ఇంగ్లండ్ బౌలర్లను పూర్తిగా డిఫెన్స్ లోకి నెట్టాడు. అయితే ఆండర్సన్ వేసిన 13వ ఓవర్లో అతనితో రోహిత్ గొడవ పడ్డాడు. రోహిత్ ఫామ్ చూసి అతని ఏకాగ్రతను దెబ్బతీయాలని ఇంగ్లండ్ పేసర్ చూశాడు. ఆ ఓవర్లో ఓ రిస్కీ సింగిల్ తీసుకొని నాన్ స్ట్రైకర్ ఎండ్ లోకి వెళ్లిన రోహిత్ ను ఆండర్సన్ ఏదో అన్నాడు. దీంతో షాక్ తిన్న రోహిత్ వెంటనే కోలుకొని అతనికి గట్టిగానే సమాధానం ఇచ్చాడు.

దీనిపై ఆ సమయంలో కామెంటరీ బాక్స్ లో ఉన్న రవిశాస్త్రి స్పందించాడు. "రోహిత్ అవతలివైపు వెళ్లగానే ఆండర్సన్ తో కాస్త సీరియస్ గా మాట్లాడాడు. ప్రత్యర్థి బ్యాటర్ అయినా బౌలర్ అయినా కాస్త రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూడటం సహజం" అని రవిశాస్త్రి అన్నాడు.

కోహ్లిని సమం చేసిన యశస్వి

ఇక నాలుగో రోజు తొలి సెషన్ లో ది గ్రేట్ విరాట్ కోహ్లి రికార్డును ఓపెనర్ యశస్వి జైస్వాల్ సమం చేశాడు. ఇంగ్లండ్ పై ఒక సిరీస్ లో అత్యధిక పరుగుల రికార్డు అది. 2016-17లో ఇండియా పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ పై విరాట్ కోహ్లి 655 రన్స్ చేశాడు. ఇప్పుడు జైస్వాల్ రెండో ఇన్నింగ్స్ లో 37 పరుగులు చేయడం ద్వారా కోహ్లిని సమం చేశాడు.

రెండో ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు యశస్వి 618 రన్స్ తో ఉన్నాడు. ఈ ఇన్నింగ్స్ లో సరిగ్గా 37 రన్స్ చేసి కోహ్లి రికార్డును సమం చేశాడు. ఇక ఇప్పుడతడు ధర్మశాల టెస్టులో ఈ రికార్డు బ్రేక్ చేయడంతోపాటు ఒక ద్వైపాక్షిక సిరీస్ లో 700కుపైగా రన్స్ చేసిన రెండో ఇండియన్ బ్యాటర్ గా నిలవడపై కన్నేశాడు. గతంలో సునీల్ గవాస్కర్ మాత్రమే ఈ రికార్డు సాధించాడు.

విజయానికి చేరువైన ఇండియా

మూడో రోజు రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 40 రన్స్ చేసిన టీమిండియా నాలుగో రోజు తొలి సెషన్ లో త్వరత్వరగా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నిజానికి తొలి గంట పాటు రోహిత్, యశస్వి ధాటిగా ఆడుతూ సులువగా టార్గెట్ చేజ్ చేసేలా కనిపించినా.. యశస్వి ఔటవడంతో కథ మారింది.

ఆ వెంటనే రోహిత్ (55), రజత్ పటీదార్ (0) కూడా ఔటయ్యారు. దీంతో 84-0గా ఉన్న స్కోరు 100-3గా మారింది. ఈ సమయంలో గిల్, జడేజా కాస్త క్రీజులో నిలదొక్కుకున్నారు.లంచ్ సమయానికి ఇండియా 3 వికెట్లకు 118 రన్స్ చేసింది. విజయానికి మరో 74 పరుగులు అవసరం.

WhatsApp channel