భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం ప్రారంభమవుతోంది. దశాబ్దానికి పైగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీమిండియా టెస్టు టీమ్ కు ప్రధాన స్తంభాల్లాగా ఉన్నారు. కానీ వీళ్లు ఇద్దరు లేకుండా టీమిండియా చాలా కాలం తర్వాత టెస్టు ఆడబోతుంది. నేడే (జూన్ 20) ఇంగ్లాండ్ తో ఫస్ట్ టెస్టు. కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ ఎరా ప్రారంభమవుతుంది. అలాగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సైకిల్ లో ఇదే ఫస్ట్ సిరీస్. దీంతో ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్ స్పెషల్ గా మారింది.
లీడ్స్ లోని హెడింగ్లీలో జరిగే తొలి టెస్టుతో టీమిండియా ఐదు టెస్టుల ఇంగ్లాండ్ పర్యటన ప్రారంభం కానుంది. భారత క్రికెట్లో కొత్త శకానికి ఇది నాంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత తొలిసారి టెస్టు జట్టుకు సారథ్యం వహిస్తున్న శుభ్‌మన్ గిల్ పై అందరి ఫోకస్ ఉంది. కేవలం 25 సంవత్సరాల వయస్సులో గిల్ టెస్టు పగ్గాలు చేపడుతున్నాడు. అయితే బ్యాటింగ్ పరంగా గిల్ టెస్టు రికార్డు గొప్పగా ఏం లేదు. కేవలం 32 టెస్టులు మాత్రమే ఆడిన గిల్ సగటు 35కు పైగా ఉండడంతో విమర్శలు వస్తున్నాయి.
రిషబ్ పంత్ టీమిండియా వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ లో కీలకం కానున్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, అర్ష్ దీప్ సింగ్ తో కూడిన పేస్-హెవీ అటాక్ పై భారత్ ఆధారపడే అవకాశం ఉంది. మరోవైపు బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జో రూట్, హ్యారీ బ్రూక్, కాన్వే, డకెట్ లాంటి ప్లేయర్లతో బలంగా ఉంది.
భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు ఎక్కడ జరుగుతోంది? లీడ్స్ లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.
జూన్ 20 నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.
భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది.
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు భారత్ లో టీవీలో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రసారం కానుంది.
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు జియో హాట్ స్టార్ ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
సంబంధిత కథనం