Ind vs Eng 1st T20 Toss: టాస్ గెలిచిన టీమిండియా.. మొదట బౌలింగ్ ఎంచుకున్న సూర్యకుమార్.. షమికి నో ఛాన్స్
Ind vs Eng 1st T20 Toss: ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. అయితే తుది జట్టులో షమికి చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
Ind vs Eng 1st T20 Toss: తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈడెన్ గార్డెన్స్ లో రాత్రి పూట మంచు కురిసే అవకాశం ఉండటంతో మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. అయితే తుది జట్టులో పేస్ బౌలర్ మహ్మద్ షమికి చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అతనితోపాటు ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలు కూడా ఈ మ్యాచ్ లో ఆడటం లేదని టాస్ సందర్బంగా సూర్య చెప్పాడు.

ఇండియా టీమ్ ఇలా..
ఇంగ్లండ్ తో తొలి టీ20 కోసం టీమిండియా తుది జట్టు ఎంపిక ఆశ్చర్యం కలిగించింది. ఈడెన్ లోని పిచ్ పేస్ బౌలింగ్ కు అనుకూలిస్తుందని తెలిసినా ముగ్గురు స్పిన్నర్లకు చోటు దక్కింది. గాయం నుంచి కోలుకొని చాలా రోజుల తర్వాత షమి తిరిగి వచ్చినా అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. పిచ్ షమి బౌలింగ్ కు అనుకూలించేలా ఉన్నా అతని పక్కన పెట్టడంపై క్రికెట్ పండితులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇండియా తుది జట్టు ఇదే
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్, తిలక్ వర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్
పిచ్ ఎలా ఉందంటే?
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించనుంది. పిచ్ పై పచ్చిక ఉంది. దీంతో పేస్ బౌలర్లకు కూడా ఈ పిచ్ అనుకూలించేలా ఉంది. ఈ గ్రౌండ్ లో ఈ మధ్య కాలంలో టీ20 మ్యాచ్ లలో ప్రతి ఇన్నింగ్స్ కు సగటున 10 సిక్స్ లు నమోదు కావడం విశేషం. దీంతో ఈసారి కూడా పిచ్ పూర్తి బ్యాటింగ్ కు అనుకూలించడం ఖాయంగా కనిపిస్తోంది. భారీ స్కోర్లు నమోదవుతాయని పిచ్ రిపోర్ట్ సందర్భంగా క్రికెట్ పండితులు స్పష్టం చేశారు.
తొలి టీ20కి ఇంగ్లండ్ టీమ్ ఇదే
తొలి టీ20 కోసం ఇంగ్లండ్ ఒక రోజు ముందే తమ జట్టును అనౌన్స్ చేసింది. ఇంగ్లండ్ జట్టులో బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టన్, జాకబ్ బేతెల్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ ఉన్నారు.